ఒకే ఒక్క సినిమాతో ప్రభాస్ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు సుజీత్. ‘రన్ రాజా రన్’ తర్వాత దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ అనే సినిమా చేశాడు ప్రభాస్. తెలుగు నాట ప్లాఫ్ అయిన ఈ సినిమా ఉత్తరాదిన మాత్రం చక్కటి విజయాన్ని సాధించింది. అదే ప్రభాస్ కి డైరెక్టర్ సుజీత్ పై విశ్వాసం పెరగటానికి కారణమైంది. అందుకేనేమో ఇప్పుడు సుజీత్ తో మరో సినిమా చేయటానికి రెడీ అవుతున్నాడు ప్రభాస్.
Read Also: చిరు సినిమాతో మణిశర్మ కొడుకు హవా మొదవుతుందా!?
ప్రభాస్ కోసం సూపర్ కాప్ కథను సిద్ధం చేస్తున్నాడట సుజీత్. ఇటీవల సినిమా లైన్ ను ప్రభాస్ కి వినిపించాడట సుజీత్. లైన్ ప్రభాస్ కి కూడా నచ్చిందట. ప్రస్తుతం సుజీత్ స్క్రిప్ట్‌ను డెవలప్ చేసే పనిలో ఉన్నాడు. అయితే ఈ సినిమాను ప్రభాస్ వీలయినంత ఫాస్ట్ గా పూర్తి చేయాలనుకుంటున్నాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ఆడియన్స్ ముందుకు రావచ్చని టాక్. ప్రస్తుతం ప్రభాస్ ‘సాలార్, ఆదిపురుష్’ షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. అలాగే ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ చేయవలసి ఉంది. ఇక ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ సంక్రాంతి విడుదలకి రెడీ అవుతోంది.