పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలని చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG, వినోదయ సిత్తం రీమేక్ సినిమాలు చేస్తున్నాడు. షెడ్యూల్ తర్వాత షెడ్యూల్ చేసుకుంటూ ఈ సినిమాల షూటింగ్ కి పవన్ జెట్ స్పీడ్ లో చేస్తున్నాడు. పవన్ లైనప్ లో ఉన్న ఈ సినిమాలన్నింటిలో భారి హైప్ ఉన్న ప్రాజెక్ట్ OG. అనౌన్స్మెంట్ నుంచే రచ్చ లేపుతున్న ఈ సినిమాని అనుకున్న సమయానికే షూటింగ్ కంప్లీట్ చేసేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇటివలే స్టార్ట్ అయిన ఉస్తాద్ ఫస్ట్ షెడ్యూల్ అయిపోగానే మళ్లీ ముంబైలో వాలిపోయాడు పవర్ స్టార్. రీసెంట్‌గానే ‘ఓజి’ షూటింగ్‌ను భారీ యాక్షన్‌తో మొదలు పెట్టారు. ఈ సినిమాను సుజీత్ పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. ముంబైలో స్టార్ట్ చేసిన ఫస్ట్ షెడ్యూల్‌లో హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా జాయిన్ అయింది.
పంజా వైబ్స్ ఇస్తున్న OG ముంబై షెడ్యూల్ కూడా పూర్తి అయినట్టు తెలుస్తోంది. నెక్స్ట్ షెడ్యూల్‌ని పూణేలో ప్లాన్ చేస్తున్నారట. ఈ గ్యాప్‌లో పవన్ పొలిటికల్ పనులతో బిజీ కానున్నారని సమాచారం. మే ఫస్ట్ వీక్‌లో పూణె షెడ్యూల్ పూర్తి చేయనున్నారట. ఇలా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ చూస్తుంటే OG షూటింగ్ బుల్లెట్ కన్నా ఫాస్ట్‌గా దూసుకుపోతున్నట్టే కనిపిస్తోంది. అయితే ఉస్తాద్, OG సినిమాలని పరుగులు పెట్టిస్తున్న పవన్ నుంచి ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ అప్డేట్ మాత్రం రావడం లేదు. వాస్తవానికి ఉస్తాద్, OGలతో పాటు వీరమల్లు షూటింగ్‌ను కూడా పవన్ కంప్లీట్ చేయనున్నారని వినిపించింది కానీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో అసలు హరిహర వీరమల్లు పరిస్థితేంటి, ఎంతవరకు వచ్చింది అనే విషయాల్లో క్లారిటీ లేకుండా పోయింది.