బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. విజయాలు, అపజయాలు అనేది పక్కన పెడితే.. పాన్ ఇండియా సినిమాల్లో అమ్మడు మెరుపులు మాత్రం మాములుగా ఉండడం లేదు. ‘రాధేశ్యామ్’, ‘బీస్ట్’ చిత్రాలతో క్రేజీ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న పూజా ఇటీవల ‘ఎఫ్3’ లో స్పెషల్ సాంగ్ లో కనిపించి కుర్రకారును గిలిగింతలు పెట్టింది. ఇక తాజాగా ఈ బ్యూటీ మరో బంపర్ ఆఫర్ ను పట్టేసింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న ‘జనగణమణ’ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికయ్యింది. ఇప్పటికే విజయ్- పూరి కాంబోలో లైగర్ వస్తున్న విషయం విదితమే.. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో పూరి నెక్స్ట్ సినిమాను కు రంగంలోకి దింపేశాడు. అయితే ఈ చిత్రం అనౌన్స్ చేసిన దగ్గర నుంచి విజయ్ సరసం ఏ బాలీవుడ్ భామనో, హాలీవుడ్ బ్యూటీనో పూరి ప్రవేశపెడతాడని భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.. అయితే ఆ లక్కీ ఛాన్స్ ను బుట్టబొమ్మ కొట్టేసింది.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జూన్ మొదటి వారం నుంచి ముంబాయి లో మొదలు కానుంది. ఈ షూట్ లో పూజా పాల్గొననున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నా పూజా డిజాస్టర్ సెంటిమెంట్ విజయ్ అభిమానులను కలవరపెడుతోంది. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న రాధేశ్యామ్ థియేటర్ లో నిరాశను మిగిల్చి ఫ్యాన్స్ గుండెను కోసేసింది. సరే ఇది పోతే పోయింది బెస్ట్ అయినా గట్టెక్కుతుంది కదా అనుకుంటే అది కూడా డిజాస్టర్ టాక్ తో చతికిలపడింది. ఇక ఈ రెదను సినిమాలతో పూజాపై ఐరెన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. ప్రస్తుతం అమ్మడు ఈ సినిమా కాకుండా మహేష్- త్రివిక్రమ్ సినిమాలో నటిస్తోంది. ‘జనగణమణ’ కన్నా ముందు ఆ సినిమా రిలీజ్ అయ్యి హిట్ ను అందుకుంటే రౌడీ హీరో సేఫ్ అయ్యినట్లే అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈసారి బుట్టబొమ్మ అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి.