Pooja Hegde: నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు అని అల్లు అర్జున్ చేతనే పాడించుకున్న బ్యూటీ పూజా హెగ్డే. ఆ పాట వచ్చినదగ్గరనుంచి పూజా కాళ్లు చాలా ఫేమస్ అయిపోయాయి. ఇక తాజాగా ఆ కాలికే గాయమయ్యిందని పూజా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అరెరే పూజా కాలికి ఏమయ్యింది అని అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం పూజా వరుస సినిమాలతో బిజీగా మారింది. తెలుగు, తమిళ్, హిందీ బాశాల్లో అమ్మడు స్టార్ హీరోల సరసన నటిస్తూ తీరిక లేకుండా ఉంది. ఇటీవలే వెకేషన్ ఎంజాయ్ చేసి వచ్చిన ఈ బ్యూటీ తాజాగా హిందీలో సల్మాన్ సరసన నటించే సినిమా షూటింగ్ లో పాల్గొంది.. ఇక మరికొద్దిరోజుల్లో మహేష్- త్రివిక్రమ్ సినిమాలో కూడా జాయిన్ కానుంది. ఈలోపే ఈ దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఈ దెబ్బ ఎలాతగిలిందో పూజా చెప్పలేదు కానీ.. కాలు లిగ్మెంట్ టియర్ అవ్వడంతో కొన్నిరోజులు రెస్ట్ తీసుకుంటుందని అర్ధమవుతోంది.
అసలు కాలికి దెబ్బ షూటింగ్ లో తగిలిందా..? లేక మరెక్కడైనా జరిగిందా..? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఆమె కాలి గాయం చూస్తుంటే అంత గట్టిగా ఏమి తగలలేదనే తెలుస్తోంది. దీంతో ఏ షూటింగ్స్ ను పోస్ట్ పోన్ చేసుకొనవసరం లేదని తెలుస్తోంది. దీంతో మహేష్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎందుకంటే ఇటీవలే మహేష్ తల్లి ఇందిరా దేవి మృతి చెందడంతో కొన్నిరోజులు షూటింగ్ ఆలస్యం అయ్యింది. మళ్లీ ఇప్పుడు పూజా కాళీ గాయం వలన ఇంకొన్నిరోజులు షూటింగ్ క్యాన్సిల్ అవుతుందా..? అని మహేష్ అభిమానులు భయపడుతున్నారు. ఏదిఏమైనా ఈ పోస్ట్ పెట్టిన కొద్దినిమిషాల్లోనే సోషల్ మీడియాలో పూజా గాయపడినట్లు వార్తలు వైరల్ గా మారాయి. దీంతో పూజా త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.