Pooja Hegde: బుట్ట బొమ్మ పూజా హెగ్డే నేడు తన 33వ పుట్టినరోజు ను జరుపుకుంటుంది. స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈ భామ.. రెండేళ్లుగా ప్లాప్ లను మూటకట్టుకొని ఐరెన్ లెగ్ అనిపించుకుంటుంది. ఇక ఈసారి పూజా తన పుట్టినరోజు వేడుకలను మాల్దీవుల్లో జరుపుకుంది. కుటుంబంతో తన పుట్టినరోజును చాలా ప్రశాంతంగా చేసుకున్నట్లు కనిపించింది. ఇక తాను మాల్దీవుల్లో ఉన్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. చిన్న కేక్, పక్కన పిజ్జాలు పెట్టుకొని.. నవ్వుతూ కేక్ కట్ చేస్తుంది. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు పూజకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఈ ఏడాది మొత్తం లో పూజా చేసిన సినిమా ఒక్కటి కూడా లేదు.
Shaalini Pande : మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్న విజయ్ బ్యూటీ..
మహేష్ బాబు సరసన గుంటూరు కారం లో పూజా మంచి ఛాన్స్ మిస్ అయ్యింది. డేట్స్ అడ్జస్ట్ చేయలేక పూజా గుంటూరు కారం నుంచి వెళ్లినట్లు మేకర్స్ తెలిపారు. హిందీలో కూడా ఒక సినిమా లో ఎంపిక అయ్యి మళ్లీ బయటకు వచ్చేసింది. ఇలా వచ్చిన ఆఫర్లు చేజారుతున్న నేపథ్యంలో పూజా హెగ్డే పుంజుకునేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి జోడీగా ఒక సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. మరి ముందు ముందు ఈ భామ ఏమైనా హిట్ అందుకుంటుందేమో చూడాలి.