రౌడీ హీరోను ఓవర్ నైట్ స్టార్ ను చేసిన సినిమా అర్జున్ రెడ్డి.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది శాలిని పాండే. తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది.. కానీ అందులో ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు.. అన్ని ప్లాపులే పలకరించాయి.. దాంతో ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైపోయింది. ఆ తర్వాత తమిళ్, కన్నడ, హిందీ భాషలలో సినిమాలు చేసింది. అయినా ఈ బ్యూటీ కి గుర్తింపు రావడం లేదు.
ప్రస్తుతం హిందీలో ఒక సినిమాలో నటిస్తోంది. గత ఏడాది ‘ జయేష్ బాయ్ జోర్దార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తెలుగులో ‘ నిశ్శబ్దం ‘ సినిమాలో చివరిగా కనిపించింది.. ఆ సినిమా కూడా నిరాశను మిగిల్చింది.. కేరీర్ పరంగా డల్ గా ఉన్న ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో ప్రేక్షకులు అలరిస్తూ ఉంటుంది. వరుసగా పోస్ట్ లు పెడుతూ అభిమానులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అప్పుడప్పుడు బికినీ ఫోటోలను కూడా షేర్ చేస్తుంది.. తాజాగా శాలిని పాండే సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై నెటిజెన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు..
ఆ ఫోటోలను చూస్తే నైట్ ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్లినట్లు తెలుస్తుంది.. ఆ పార్టీలో మస్తుగా ఎంజాయ్ చేస్తూమ ఫుల్లుగా మందు తాగుతూ రచ్చ చేస్తున్న ఫోటోలు శాలినీ పాండే సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఒక ఫోటోలో శాలిని మిడిల్ ఫింగర్ చూపిస్తూ బూతు పదాన్ని ఎక్స్ప్రెస్ చేసింది. ఓ అమ్మాయి మిడిల్ ఫింగర్ చూపిస్తే దాని అర్థం ఏంటో అందరికీ తెలుసు. అలా శాలిని పచ్చి బూతు ఫోటో షేర్ చేసి నెటిజన్ల చేత తిట్లు తిట్టించుకుంటుంది.. మొత్తానికి ఫోటో తో వార్తల్లో నిలిచింది.. సినిమాలు ఇప్పటివరకు అనౌన్స్ చెయ్యలేదు..