హీరోలు, స్టార్ హీరోలు, సూపర్ స్టార్ లు ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటారు కానీ రేర్ గా ప్రతి ఇండస్ట్రీలో ఒకేఒక్క హీరో ఉంటాడు. అతను హిట్స్, ఫ్లాప్స్ కి అతీతంగా ఫాన్స్ ని సొంతం చేసుకుంటాడు. అతనిలో ఒక స్వాగ్ ఉంటుంది, అతని స్టైల్ ని అందరూ ఫాలో అవుతూ ఉంటారు. ఎన్ని ఏళ్లు గడిచినా అతని స్టార్ డమ్ చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది, ఎన్ని సినిమాలు వచ్చినా ఆ హీరో రికార్డుల పునాదులని కదిలించలేవు. తమిళ్ లో అలాంటి హీరో రజినీకాంత్ అయితే తెలుగులో అలాంటి హీరోకి ఒకేఒక్క పేరు ఉంది… ‘పవన్ కళ్యాణ్’. స్వాగ్, స్టైల్ కలిసి నడిస్తే పవన్ కళ్యాణ్ లా ఉంటుంది. పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ని ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా చూపిస్తూ సుజిత్ ఒక సినిమా తెరకెక్కించడానికి సిద్దమవుతున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుంది. గ్రాండ్ గా జరిగిన ఈ పూజా కార్యక్రమాల కోసం పవన్ కళ్యాణ్ టాప్ టు బాటమ్ బ్లాక్ డ్రెస్ లో వచ్చాడు. పవన్ కళ్యాణ్ కి హుడీలకి ఎదో లింక్ ఉన్నట్లు ఉంది. ఆయన ఎప్పుడు హుడీలో కనిపించినా సోషల్ మీడియా షేక్ అవుతూ ఉంటుంది, ఇక బ్లాక్ హుడీలో కనిపిస్తే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు.
Read Also: Cm Jagan Vinukonda Public Meeting Live: వినుకొండలో జగన్ బహిరంగ సభ లైవ్ అప్ డేట్స్
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి పరిస్థితే ఉంది. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ పూజ కార్యక్రమాల కోసం పవన్ కళ్యాణ్ బ్లాక్ హుడీ వేసుకోని వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోస్ లో ఒక్క ఫోటో మాత్రం పవన్ అభిమానులనే కాదు ట్విట్టర్ ని కూడా కదిలిస్తుంది. పవన్ కళ్యాణ్ నడుస్తున్నట్లు ఉన్న ఫోటో ట్విట్టర్ లో #TheyCallHimOG #FireStormIsComing అనే టాగ్స్ ని ట్రెండ్ అయ్యేలా చేస్తుంది. ఈ రెండు టాగ్స్ ప్రస్తుతం ట్విట్టర్ ని కుదిపేస్తున్నాయి. ఇలాంటి ఫోటోనే వకీల్ సాబ్ సమయంలో ఒకటి బయటకి వచ్చి ఇంటర్నెట్ సెన్సేషన్ అయ్యింది. ఆ ఫోటో ఎంతలా ట్రెండ్ అయ్యింది అంటే వకీల్ సాబ్ దర్శక నిర్మాతలు కూడా దాన్ని అఫీషియల్ పోస్టర్ లో పెట్టే రేంజులో వైరల్ అయ్యింది. ఇప్పుడు ఈ కొత్త ఫోటో కూడా అలానే అఫీషియల్ గా పోస్టర్స్ లో కనిపిస్తుందేమో చూడాలి.
THE OG HAS ARRIVED!!! #TheyCallHimOG #FireStormIsComing pic.twitter.com/Zwxutwps9f
— DVV Entertainment (@DVVMovies) January 30, 2023