Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక పవన్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి OG. కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఆసక్తిని కూడా పెంచుతున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండు అప్డేట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
Anil Ravipudi: ఇరువురి భామల మధ్య బాలయ్య పాటతో నలిగావా.. మావా
అవేంటంటే.. ఇందులో పవన్ ను అందరు ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అనే పిలుస్తారట.. కానీ, అతని పేరు మాత్రం గాంధీ అని సమాచారం. పవర్ ఫుల్ గా ఉంటుందని ఈ పేరును పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఇంకో అప్డేట్ ఏంటి అంటే.. ఈ చిత్రంలో పవన్ కు అన్న గా కిక్ శ్యామ్ నటిస్తుండగా.. వదినగా శ్రియా రెడ్డి నటిస్తుందట. ఆమె పాత్ర చాలా రూత్ లెస్ గా ఉంటుందని తెలుస్తోంది. పొగరు సినిమాలో ఆమె ఏ రేంజ్ లో ఉంటుందో.. అంతకుమించి ఉండనుందని తెలుస్తోంది. ఇక ఈ అప్డేట్స్ తెలియడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. అంతేకాదు.. పోస్టర్స్ తయారుచేసి గాంధీ అని రాసుకొచ్చేస్తున్నారు. మరి ఈ సినిమాతో సుజీత్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.