Pawan Kalyan about bheemla nayak and vakeel saab losses: పవర్ స్టర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ వైసీపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకు పడుతూ తన సినిమాల నష్టం గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం వారాహి యాత్రలో భాగంగా ఏపీలో పర్యటిస్తున్న పవన్ తన సినిమాలకు ఏపీ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రస్తావించారు. తనపై కక్షకట్టి భీమ్లా నాయక్ & వకీల్ సాబ్ రిలీజ్ అప్పుడు టికెట్స్ ధరలు తగ్గించారని, టికెట్ ధర పది రూపాయలు పెడితే పెట్టుబడి ఎప్పటికి తిరిగి వస్తుంది? ఆ సినిమాలు రెండూ సూపర్ హిట్ అయ్యాయి కానీ ఆంధ్రప్రదేశ్ వరకు నిర్మాతలకు నష్టం వచ్చింది, ఆ భారం నేనే సుమారు 30 కోట్లు భరించానని పవన్ అన్నారు. తనని ఆర్థికంగా దెబ్బతీయాలని కుట్ర చేసి, తనపై దాడులు చేసే క్రమంలో ఏపీలో సినిమా టికెట్ రేట్లు తగ్గించారని అలా చేయడం కోసమే ఒక అర్థరాత్రి జీవో తీసుకొచ్చారని పవన్ ఆరోపించారు.
Minister Roja: మెగా ప్రిన్సెస్ జననం.. ఆ హత్తుకోవడం ఇంకా మరువలేదంటూ రోజా ఎమోషనల్!
పవన్ కళ్యాణ్ నటించిన `భీమ్లా నాయక్` చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్‌ప్లే అందించగా ఆ సినిమా గతేడాది ఫిబ్రవరి 25న విడుదలైంది. సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని, కలెక్షన్ల పరంగా వంద కోట్లు దాటింది. కానీ ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉండటంతో అక్కడ కలెక్షన్లు ఎక్కువగా నమోదు అవలేదు. ఇక అంతకంటే ముందు `వకీల్ సాబ్` మూవీ 2021 ఏప్రిల్ 9న రిలీజ్ అయ్యింది. ఆ సమయంలో కరోనా ఎఫెక్ట్ తో పాటు ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపు కారణంగా హిట్ టాక్ వచ్చినా ఈ సినిమాకి కూడా ఏపీలో కలెక్షన్లు బాగా తగ్గాయి. దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.