Parineeti Chopra : మరో స్టార్ హీరోయిన్ తల్లి కాబోతోంది. ఈ మధ్య చాలా మంది హీరోయిన్లు తల్లి అయ్యారు. ఇప్పుడు అదే బాటలో పయినిస్తోంది మరో హీరోయిన్. ఆమె ఎవరో కాదు ప్రియాంక చోప్రా చెల్లెలు పరిణీతి చోప్రా. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ.. 2023లో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక లీడర్ అయిన రాఘవ్ చద్దాను పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఓ రెండు సినిమాలు, ఓ వెబ్ సిరీస్ ను కంప్లీట్ చేసింది. అవి రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.
Read Also : Bigg Boss : గుండు గీయించుకోవడం.. పేడ రాసుకోవడం.. ఏంటీ పిచ్చి టాస్కులు..
ఇలాంటి టైమ్ లో తాను ప్రెగ్నెంట్ అని పరిణీతి చోప్రా ప్రకటించింది. తమ లిటిల్ యూనివర్స్ రాబోతున్నట్టు పోస్టు పెట్టింది. ఈ పోస్టు క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. దీంతో అభిమానులు ఆమెకు విషెస్ చెబుతున్నారు. పరిణీతి చోప్రా 2012 నుంచి బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. అందం, అభినయంలో అక్కకు ఏ మాత్రం తీసిపోదు. కేసరి, ఇష్క్ జాదే లాంటి సినిమాలతో ఆమెకు పాపులారిటీ వచ్చింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసగా సినిమాలు చేసింది ఈ బ్యూటీ. రాఘవ్ చద్దాతో కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ హీరోయిన్.. ఇంట్లో వారిని ఒప్పించి చివరకు పెళ్లి చేసుకున్నారు.
Read Also : Agent : మూవీ ప్లాప్.. రూపాయి తీసుకోని హీరో.. ఎవరంటే..?