యంగ్ హీరో నాగ శౌర్య, మాళవిక నాయర్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పలానా అబ్బాయి-పలానా అమ్మాయి’. శ్రీనివాస్ అవసరాల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసింది. ఇటివలే ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసిన పలానా అబ్బాయి-పలానా అమ్మాయి చిత్ర యూనిట్… తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ‘పలానా అబ్బాయ్-పలానా అమ్మాయి’ అంటూ సాగే టైటిల్ సాంగ్ కూల్ బ్రీజ్ లా ఉంది. కళ్యాణీ మాలిక్ కంపోజ్ చేసిన సోల్ ఫుల్ ట్యూన్ కి, భాస్కరభట్ల రవికుమార్ రాసిన లిరిక్స్ చాలా బాగున్నాయి.కళ్యాణి మాలిక్, నూతనల వాయిస్ ఈ టైటిల్ సాంగ్ కి బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచాయి. లిరికల్ సాంగ్ లో అక్కడక్కడా ప్లే చేసిన విజువల్స్ లో నాగ శౌర్య, మాళవిక నాయర్ ల లవ్ జర్నీ మొత్తం చూపించారు. ఒక చోట యంగ్ లుక్ లో, ఇంకో చోట మిడ్ ఏజ్ లుక్ లో లీడ్ పెయిర్ కనిపించడం చూస్తుంటే ఈ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ వచ్చే పాట అయ్యి ఉండొచ్చు. మొత్తానికి ఈ సాంగ్ తో మేకర్స్ పలానా అబ్బాయి-పలానా అమ్మాయి సినిమా మంచి ఫీల్ గుడ్ మూవీ అవుతుంది అనే నమ్మకం కలిగించారు.
Read Also: Vishwak Sen: డాలర్ పిల్లగాడు వచ్చేసాడు…
Loveable Retro Melody #PhalanaAbbayiPhalanaAmmayi
title song out nowWatch Full Lyrical here👇https://t.co/94XgluKmNa#PAPA@IamNagashaurya @iamMalavikaNair#SrinivasAvasarala @vishwaprasadtg@vivekkuchibotla @PSrividya53 pic.twitter.com/ssWqsQf4Ml
— People Media Factory (@peoplemediafcy) March 6, 2023