మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరో నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చెయ్యడానికి విశ్వక్ సేన్ స్ట్రాంగ్ ఎఫోర్ట్స్ పెడుతున్నాడు. రెగ్యులర్ ఫార్మాట్ పక్కా కమర్షియల్ సినిమాగా తెరకెక్కిన ‘దాస్ కా ధమ్కీ’ సినిమా ఫిబ్రవరి 17నే రిలీజ్ కావాల్సి ఉంది కానీ షూటింగ్ డిలే అవ్వడంతో విశ్వక్ ఈ మూవీ రిలీజ్ ని వాయిదా వేశాడు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం దాస్ కా ధమ్కీ సినిమా మార్చ్ 22న ఉగాది రోజున రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. డేట్ ని లాక్ చేసిన విశ్వక్ ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు కానీ ఆ తర్వాతి వారంలో నాని ‘దసరా’ రిలీజ్ అవ్వనుంది. ఏప్రిల్ నుంచి సమ్మర్ సినిమాలు రిలీజ్ రేస్ లోకి వచ్చేస్తాయి కాబట్టి విశ్వక్ మార్చ్ మూడో వారంలో తన సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇప్పటికే ప్రమోషన్స్ ని మొదలుపెట్టిన విశ్వక్ సేన్, దాస్ కా ధమ్కీ సినిమా నుంచి రెండు పాటలని, ఒక ట్రైలర్ ని రిలీజ్ చేసి మంచి బజ్ ని జనరేట్ చేశాడు. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా, మావా బ్రో సాంగ్స్ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. లేటెస్ట్ గా దాస్ కా ధమ్కీ సినిమా నుంచి ‘ఓ డాలర్ పిల్లగా’ సాంగ్ ని రిలీజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ జేమ్స్ ఇచ్చిన ట్యూన్ కి మంగ్లీ జోష్ ఫుల్ వాయిస్ కలవడంతో ‘ఓ డాలర్ పిల్లగా’ సాంగ్ స్పెషల్ గా మారింది. పబ్ లో డిజైన్ చేసిన ఈ సాంగ్, హిందిలోని సూపర్ హిట్ పాట అయిన ‘తు ఛీజ్ బడీ హై’ సాంగ్ ని గుర్తు చేసేలా ఉంది కాబట్టి నార్త్ లో ‘ఓ డాలర్ పిల్లగా’ సాంగ్ లో ఎక్కువగా క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది.
Set your speakers in full blast 💥💥#ODollarPillagaa song is out now🤑
– https://t.co/iqFnaIBkvr#DasKaDhamki – RELEASING THIS MARCH🔥@Nivetha_Tweets @leon_james @PranatiRai @iamMangli @deepakmuziblue @VanmayeCreation @VScinemas_ @saregamasouth pic.twitter.com/uyViUnkd6z
— VishwakSen (@VishwakSenActor) March 6, 2023