చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆసక్తికర సినిమాలు, సిరీస్‌లు ఈ నెలలో వివిధ OTT ప్లాట్‌ఫామ్‌లలో వస్తున్నాయి. ఫిబ్రవరి డిజిటల్ హంగామా ఏమిటో ఓ లుక్కేద్దాం.
లూప్ లాపేట 1998లో విడుదలైన జర్మన్ చిత్రం ‘రన్ రోలా రన్’కి అధికారిక రీమేక్ ‘లూప్ లాపేట’. తన ప్రియుడిని రక్షించుకోవడానికి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాల్సిన అమ్మాయి పాత్రలో తాప్సీ నటించింది. నెట్‌ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 4న ‘లూప్ లాపేట’ రాబోతోంది.
ది గ్రేట్ ఇండియన్ మర్డర్ వికాస్ స్వరూప్ ప్రసిద్ధ నవల సిక్స్ సస్పెక్ట్స్ ఆధారంగా రూపొందించిన మిస్టరీ సిరీస్ ‘ది గ్రేట్ ఇండియన్ మర్డర్’. ఇందులో ప్రతీక్ గాంధీ, రిచా చద్దా డిటెక్టివ్‌లుగా నటించారు. పేరు మోసిన పారిశ్రామికవేత్త హత్య మిస్టరీని ఛేదించడమే కథ. డిస్నీ+హాట్‌స్టార్ లో ఫిబ్రవరి 4న విడుదల కానుంది.
రాకెట్ బాయ్స్ డాక్టర్ హోమీ జె భాబా వంటి మార్గదర్శకులు జీవించిన భారతదేశంలో అంతరిక్ష కార్యక్రమానికి సంబంధించిన కథ ఇది. హోమీ భాబా పాత్రను జిమ్ షర్బ్ పోషించారు. ఇష్వాక్ సింగ్ మరొక చారిత్రక వ్యక్తి డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పాత్రను పోషించారు. అభయ్ పన్ను దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. సోనీ LIV లో ఫిబ్రవరి 4న విడుదల కానుంది.
గెహ్రైయాన్ ఈ చిత్రంలో దీపికా పదుకొనే, సిద్ధార్థ్ చతుర్వేది, అనన్య పాండే, నసీరుద్దీన్ షా వంటి హై ఎండ్ కాస్టింగ్ ఉంది. ఆల్రెడీ ఇది సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘గెహ్రైయాన్’ ఫిబ్రవరి 11న రానుంది.
భామా కలాపం అభిమన్యు తడిమేటి రచన, దర్శకత్వం వహించిన వెబ్ మూవీ ఇది. ఇందులో ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తుంది. SVCC డిజిటల్ ఈ చిత్రాన్ని నిర్మించగా, ‘ఆహా’ ఒరిజినల్ ఫిల్మ్‌గా విడుదల అవుతోంది. తెలుగు వెబ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ‘భామా కలాపం’ ఫిబ్రవరి 11న అలరించనుంది.
మళ్ళీ మొదలైంది సుమంత్, నైనా గంగూలీ జంటగా నటించిన ‘మళ్ళీ మొదలైంది’ సినిమాని ముందుగా థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఇది జీ5లో డైరెక్ట్ ఓటీటీగా విడుదలవుతోంది. ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో రొమాంటిక్ స్టోరీతో సినిమా నడుస్తుంది. TG కీర్తి కుమార్ దర్శకుడు, K రాజశేఖర రెడ్డి నిర్మాత. ఫిబ్రవరి 11న విడుదల కానుంది.
83 ఓ చారిత్రక ఘట్టం బయోపిక్‌గా 2021లో భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమా ’83’. ఈ చిత్రం 1983 ప్రపంచ కప్ విజయాన్ని పెద్ద తెరపైకి మళ్ళీ చూపించింది, రణవీర్ సింగ్… కపిల్ దేవ్ పాత్రను పోషించాడు. దక్షిణాదిలో సందడి చేయనప్పటికీ ఉత్తరాదిలో బాగానే ఆడింది. దీనికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించగా, విష్ణువర్ధన్ ఇందూరి నిర్మించారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఈ చిత్రం ఫిబ్రవరి 18న విడుదల కానుంది.