డైరెక్టర్ వెట్రిమారన్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో వచ్చిన ‘విడుదల 1’ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా ‘విడుదల పార్ట్ 2’ కూడా వచ్చింది. విజయ్ సేతుపతితో పాటు సూరి, మంజు వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవానీ శ్రీ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళ్ తో పాటు తెలుగులోనూ ఒకసారి రిలీజై సూపర్ హిట్ గా నిలిచింది.
విజయ్ సేతుపతి, సూరి, మంజూ వారియర్ ల అద్భుతమైన నటన, వెట్రి మారన్ టేకింగ్ ఆడియన్స్ ను ఫిదా చేశాయి. అయినప్పటికీ ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది. రన్ టైమ్ విషయంలోనూ విమర్శలు ఎదుర్కొంది. కాగా ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ‘విడుదల పార్ట్ 2’ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం (జనవరి19) అర్ధరాత్రి నుంచే ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. ప్రస్తుతం తమిళ్ తో పాటు, తెలుగు భాషలోనూ స్ట్రీమింగ్ అవుతుంది. కాగా ‘విడుదల పార్ట్ 1’ కూడా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి పార్ట్ కూడా చూడని వారు. రెండు చిత్రాలు ఒకే సారి చూసేయండి.
అయితే గత ఏడాది విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘మహారాజా’ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.ఆ సినిమా ఓటీటీ లో మంచి విజయం అందుకుంది. దీంతో OTT ప్రేక్షకులు విజయ్ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఇప్పుడు ఈ ‘విడుదల పార్ట్ 2’ ని ఎంతమేరకు ఆదరిస్తారో చూడాలి.