Prabhas : మరోసారి ప్రభాస్ తో థమన్!? ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ల మధ్యలో చిన్న సినిమా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాకు ఫుల్ ఫామ్ లో ఉన్న సంగీత దర్శకుడు తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. బాలకృష్ణ ‘అఖండ’కు తమన్ నేపథ్యసంగీతం ఎంతో ప్లస్ అయింది. దాంతో ‘రాధేశ్యామ్’ కి తమన్ ని తీసుకున్నారు. అయితే సినిమా డిజాస్టర్ అయింది. అందరు హీరోలతో హిట్స్ ఉన్న తమన్ కి ఇది నిరాశ కలిగించే అంశమే. ఇప్పుడు ప్రభాస్ తో మరోసారి పని చేసే అవకాశం లభించింది. దర్శకుడు మారుతీతో ప్రభాస్ తో తీయబోయే హారర్ కామెడీ ఫిల్మ్ కి తమన్ నే సంగీత దర్శకుడుగా ఎంపిక చేసుకున్నట్లు వినిపిస్తోంది. నిజానికి ఈ తరహా హారర్ కామెడీ చిత్రాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో ఇంపార్టెంట్. అందులో నిష్ణాతుడైన తమన్ ని అందుకే ఎంపిక చేసినట్లు సమాచారం.
తమన్ కూడా ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాడట. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయట. ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా ఓ థియేటర్ నేపథ్యంలో జరగనుంది. అందుకోసం భారీ థియేటర్ సెట్ వేస్తున్నారు. ఆగస్టులో లాంఛనంగా ప్రారంభించి రెండు షెడ్యూల్స్‌లో పూర్తి చేయాలన్నది ప్లాన్. ప్రభాస్ కూడా దానికి తగ్గట్లే 50 రోజుల కాల్షీట్స్ కేటాయిస్తున్నాడట. తన స్నేహితులైన యువీ క్రియేషన్స్ కోసమే ఈ ప్రాజెక్ట్ ను లైనప్ లో పెట్టాడు ప్రభాస్. ‘రాధేశ్యామ్’తో వచ్చిన నష్టాలను ఈ సినిమాతో పూడ్చాలని ప్రభాస్ ఆలోచన. ఈ సినిమా టైటిల్ ను ప్రారంభం రోజున ప్రకటిస్తారట. అయితే ఇది ప్యాన్ ఇండియా సినిమా కాదు. తెలుగులో మాత్రమే తెరకెక్కనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్‌తో ‘సాలార్’, ఓం ప్రకాశ్ రౌత్‌తో ‘ఆదిపురుష్’, నాగ్ అశ్విన్‌తో ‘ప్రాజెక్ట్ కె’ వంటి ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. వీటి మధ్యలో క్విక్ గా తెరకెక్కి వెంటనే రిలీజ్ కాబోయే ఈ సినిమా ఆడియన్స్ ను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
Also Read
- Bethlehem Kudumba Unit : 'బెత్లెహం కుడుంబ యూనిట్' తెలుగు విడుదలకు అడ్డంకి
- Yasha Nagula : యూట్యూబ్‌ను షేక్ చేసిన 'యేషనాగుల'.. 5 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్!
- Yash Toxic: రేపు యశ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్! ‘టాక్సిక్’కు మళ్లీ థియేట్రికల్ ట్రీట్.. కానీ ఈసారి స్పెషల్ వెర్షన్
- Ravi Teja: రవితేజకు ‘ఇరుముడి’ ఏం నేర్పింది? మాస్ మహారాజాలో ఈ మార్పు ఎప్పుడూ చూడలేదు!
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!