Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andre Russell: వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ టీ20 క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్‌లలో తనదైన ముద్ర వేసిన రస్సెల్.. తాజాగా 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో ఈ ఘనత సాధించాడు. దీంతో టీ20 క్రికెట్లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న 21వ బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాకుండా ఈ ఫార్మాట్లో 10 వేల పరుగులతో పాటు 500కు పైగా వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్నాడు. బట్లర్ ఇప్పటివరకు ఈ ఫార్మాట్లో 15,062 పరుగులు చేశాడు. టీ20 క్రికెట్లో 15 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఏకైక ఆటగాడిగా నిలిచాడు. మరోవైపు వెస్టిండీస్ దిగ్గజం కీరన్ పొలార్డ్ 14,999 పరుగులతో ఈ జాబితాలో తర్వాతి స్థానంలో ఉన్నాడు. 15 వేల పరుగుల క్లబ్లో చేరడానికి అతడు కేవలం ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు.
Also Read
- AP MPTC and ZPTC Elections: ఎన్నికల వేళ ఉద్రిక్తత.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సహా పలువురిపై కేసులు.. మరికొందరు అరెస్ట్..!
- Hormuz Strait Crisis: హార్మూజ్ జలసంధిపై ఇరాన్ సంచలన ప్రకటన.. అమెరికా ముందు ఏడు షరతులు..
- 37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
- 100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
టీ20ల్లో 10 వేల పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో బట్లర్, పొలార్డ్‌తో పాటు అలెక్స్ హేల్స్, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్ వంటి దిగ్గజాలు ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో ఆండ్రీ రస్సెల్ కూడా చేరాడు. టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాను పరిశీలిస్తే ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 743 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆండ్రీ రస్సెల్‌తో పాటు మొత్తం ఆరుగురు బౌలర్లు ఈ ఫార్మాట్లో 500కు పైగా వికెట్లు సాధించారు. ఈ జాబితాలో సునీల్ నరైన్, డ్వేన్ బ్రావో, ఇమ్రాన్ తాహిర్, షకీబ్ అల్ హసన్ వంటి స్టార్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. అయితే వీరిలో ఎవరూ టీ20ల్లో 10 వేల పరుగులు, 500 వికెట్ల మైలురాళ్లను ఒకేసారి అందుకోలేకపోయారు.
డ్వేన్ బ్రావో తన టీ20 కెరీర్లో 6,970 పరుగులు చేయగా, షకీబ్ అల్ హసన్ 7,910 పరుగులు సాధించాడు. వీరిద్దరూ బంతితో, బ్యాట్‌తో రాణించినప్పటికీ 10 వేల పరుగుల మార్కును చేరుకోలేదు. కానీ ఆండ్రీ రస్సెల్ మాత్రం బ్యాటింగ్‌లో 10 వేల పరుగులు, బౌలింగ్‌లో 500కు పైగా వికెట్లు సాధించి ఈ ఘనత అందుకున్న ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా నిలిచాడు. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.
తాజావార్తలు
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
Doping Test: డోపింగ్ పరీక్షలో దొరికిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్.. కానీ ఓ ట్విస్ట్!
-
AP MPTC and ZPTC Elections: ఎన్నికల వేళ ఉద్రిక్తత.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సహా పలువురిపై కేసులు.. మరికొందరు అరెస్ట్..!
-
IPL Players Retention Fee: ఐపీఎల్లో మరో సంచలనం.. రూ.40 కోట్లు కావాలంటున్న టాప్ ప్లేయర్లు!
-
Hormuz Strait Crisis: హార్మూజ్ జలసంధిపై ఇరాన్ సంచలన ప్రకటన.. అమెరికా ముందు ఏడు షరతులు..
ట్రెండింగ్
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!
-
IND vs SL 1st ODI: బీసీసీఐ కీలక నిర్ణయం.. విశాఖలో తొలి వన్డే.. వేదిక మార్పుకు కారణం ఇదే!