CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
- మూడు రోజుల పాటు సీఎం పర్యటన
- రూ.9,100 కోట్ల పనులకు శ్రీకారం
- రైతులు, పారిశ్రామికవేత్తలతో భేటీ
- నవంబర్ 9న భారీ బహిరంగ సభ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం నుంచి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.9,100 కోట్ల భారీ అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు , ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పోను ప్రారంభించడంతో పాటు రైతులు, పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలతో సీఎం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
పర్యటనలో మొదటి రోజైన శనివారం ఉదయం 11 గంటలకు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలోని యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ హబ్ ఆవరణలో మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పోను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించి, మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన అనంతరం, మధ్యాహ్నం 3 గంటలకు హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో కొడంగల్ నివాసానికి చేరుకుని అక్కడే రాత్రి బస చేస్తారు.
Also Read
- CM Revanth Reddy: పౌల్ట్రీ రైతులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్.. 48 గంటల్లో కీలక నిర్ణయం!
- Basara IIIT Student S*uicide: బాసర ట్రిపుల్ విద్యార్థి ఆత్మ*హత్యకు అసలు కారణం ఇదే.. కీలక విషయాలు వెల్లడి..!
- Weight Loss Injection: 'ఫ్యాట్ టూ ఫిట్' పేరుతో భారీ మోసం.. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు..!
- Nasha Mukt Bharat: డ్రగ్స్‌కు నో చెప్పండి, జీవితానికి ఎస్ చెప్పండి.. యువతకు హీరో వెంకటేష్ పిలుపు!
రెండో రోజు నవంబర్ 8వ తేదీ ఉదయం 9:30 నుంచి 10:20 గంటల వరకు స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశమయ్యే సీఎం, ఆ తర్వాత పలు అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. ఉదయం 10:30 గంటలకు ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.81 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఎకోపామ్ పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా హకీంపేటలో నాట్కో సంస్థ సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన జెడ్పీ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రారంభిస్తారు. అలాగే బొంరాస్‌పేటలో జూనియర్ కళాశాల, కొడంగల్, దుద్యాల, హకీంపేట ప్రాంతాలలో నూతన పోలీస్ స్టేషన్లు, దుద్యాలలో రూ.12 కోట్లతో నిర్మించిన సమీకృత మండల కార్యాలయ భవనాన్ని జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం కోస్గి మండలం నాచారంలో రూ.5,060 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రేడియల్ రోడ్డు–2కు శంకుస్థాపన చేసి, కోస్గిలో సైన్స్ మ్యూజియం, దౌల్తాబాద్‌లో పీహెచ్సీ, జూనియర్ కళాశాలను ప్రారంభించి రాత్రికి కొడంగల్‌లో బస చేస్తారు.
పర్యటనలో చివరి రోజైన నవంబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు హకీంపేటలో నిర్వహించనున్న భారీ రైతు బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ పర్యటన ద్వారా కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి వేగం మరింత పుంజుకోనుంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 50 బంతుల్లో డబుల్ సెంచరీ చేయొద్దు ప్లీజ్.. న్యూజిలాండ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
CM Revanth Reddy: పౌల్ట్రీ రైతులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్.. 48 గంటల్లో కీలక నిర్ణయం!
-
Basara IIIT Student S*uicide: బాసర ట్రిపుల్ విద్యార్థి ఆత్మ*హత్యకు అసలు కారణం ఇదే.. కీలక విషయాలు వెల్లడి..!
-
Ramayana Record: రామాయణ వరల్డ్ రికార్డు.. బాహుబలి 2 రికార్డు బ్రేక్.. నెక్స్ట్ టార్గెట్..?
-
Chiranjeevi: ‘కాకా’ కూడా హిట్ పడితే ఇక చిరునే టాప్?
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!