Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav Meets PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ని భారత టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తన కుటుంబంతో కలిసి న్యూఢిల్లీలో కలిశాడు. దీపావళి (Diwali) పండుగ వేళ జరిగిన ఈ ప్రత్యేకమైన కలయిక క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఇటీవల భారత్ సాధించిన 2026 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ (2026 ICC Men’s T20 World Cup) విజయాన్ని పురస్కరించుకుని సూర్యకుమార్ యాదవ్ తన గోల్డ్ మెడల్ (Gold Medal) తో ఈ భేటీకి హాజరయ్యాడు. ఆ బంగారు పతకాన్ని పట్టుకుని పీఎం మోడీ, సూర్యా ఇద్దరూ ఫొటోలకు ఫోజులిచ్చిన దృశ్యం టీమిండియా చారిత్రాత్మక విజయ జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసింది. ఈ ప్రత్యేకమైన భేటీకి సంబంధించిన వివరాలను ప్రధాని మోడీ తన అధికారిక ఎక్స్ (X) ఖాతా ద్వారా పంచుకున్నారు. “దీపావళి పండుగ వాతావరణంలో రాముడు, సరుయు రాక జరిగింది. దీనివల్ల ఈ పండుగ వాతావరణం మరింత పవిత్రంగా, దైవికంగా మారింది” అని మోడీ ట్వీట్ చేశారు.
ఇక, టీ20 ఫార్మాట్లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటర్‌గానే కాకుండా కెప్టెన్‌గా కూడా అద్భుతమైన రికార్డు సృష్టించాడు. 2022, 2023 సంవత్సరాలకు గాను ఐసీసీ మెన్స్ టీ20ఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ (ICC Men’s T20I Cricketer of the Year)గా ఎంపికయ్యాడు. అలాగే అక్టోబర్ 2022 లో ఐసీసీ టీ20ఐ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ (ICC T20I Batting Rankings)లో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అంతేకాకుండా జనవరి 2023 లో 910 రేటింగ్ పాయింట్లు సాధించి టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బ్యాటర్లలో ఒకరిగా నిలిచాడు.
Also Read
- OTR: తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమశిక్షణ కట్టు తప్పుతోందా? పీసీసీ పిలిచినా నో రియాక్షన్!
- AP HRC: "నాలుగు వారాల్లో నివేదిక సమర్పించండి".. రాప్తాడు ఘటనను సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ
- AP Onion Prices: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కిలో ఉల్లిపాయలు
- Supreme Court: ఢిల్లీలో దీపావళి గిఫ్ట్స్ కల్చర్‌పై సుప్రీంకోర్టు ఆందోళన.. కాలుష్యంపై ఆగ్రహం..
వ్యక్తిగత ప్రదర్శనలతోనే కాకుండా కెప్టెన్‌గా కూడా టీమిండియా విజయాల్లో సూర్య కీలక పాత్ర పోషించాడు. 2024 టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టులో ప్రధాన పాత్ర పోషించిన అతడు, 2026 లో కెప్టెన్‌గా జట్టును విజేతగా నిలబెట్టాడు. సూర్య నాయకత్వంలోనే వరుసగా రెండోసారి కప్ గెలిచి, టీ20 వరల్డ్ కప్‌ను సక్సెస్‌ఫుల్‌గా డిఫెండ్ చేసుకున్న తొలి జట్టుగా భారత్ రికార్డుకెక్కింది. దీనికి ముందే 2025 లో యూఏఈ (UAE) లో జరిగిన టీ20 ఆసియా కప్ (T20 Asia Cup) ను కూడా ఆయన కెప్టెన్సీలోనే టీమిండియా గెలుచుకుంది. అయితే 2026 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ శకానికి తెరపడింది. తదుపరి జరిగిన ఇంగ్లండ్, ఐర్లాండ్ లతో కూడిన యూకే టూర్ (UK Tour) టీ20 సిరీస్‌కు ఆయనను జట్టు నుంచి మినహాయించారు. సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ను కొత్త కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఐపీఎల్ (IPL) లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) కు శ్రేయస్ విజయవంతంగా నాయకత్వం వహించడం ఆయనకు ప్లస్ పాయింట్ అయింది. మరోవైపు ఈ మధ్య కాలంలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఫామ్ (Batting Form) కొద్దిగా తగ్గడం కూడా సెలక్టర్ల నిర్ణయంపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.
दीपावली के माहौल में राम और सरयू का आगमन हुआ है। इससे दीपावली का वातावरण और भी पावन एवं दिव्य हो गया है।
@surya_14kumar https://t.co/B6vwr35Iwm
— Narendra Modi (@narendramodi) November 6, 2026
తాజావార్తలు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
-
Off The Record: నెల్లూరు జడ్పీ పీఠంపై టీడీపీలో అసంతృప్త రాగాలు.. అన్నీ వాళ్ళ కోటాకేనా అంటూ అసహనం
-
Thammidikunta Lake : మళ్లీ 29 ఎకరాలకు తమ్మిడికుంట.. ఈ నెల 10న ప్రారంభం!
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!