Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diwali Bonus Rules: రెండ్రోజుల్లో దీపావళి పండగ వచ్చేస్తోంది. ఈ పండగకు ముందే షాపింగ్, సన్నాహాలు మొదలైపోతాయి. ఉద్యోగులైతే కంపెనీలు ఇచ్చే గిఫ్ట్‌లు, స్వీట్లు, బోనస్‌ల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. ఈ పండగ ఖర్చులన్నీ బోనస్‌తోనే సర్దుబాటు చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటుంటారు. కానీ, అర్హులైన ఉద్యోగులకు బోనస్ ఇవ్వడం చట్టపరంగా తప్పనిసరి అనే విషయం మీకు తెలుసా? నిబంధనలు ఉన్నప్పటికీ కంపెనీ బోనస్ ఇవ్వకపోతే, ఆ సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అసలు ఈ నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం?
భారత్‌లో ఉద్యోగుల బోనస్‌కు సంబంధించి గతంలో ‘పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్, 1965’ (Payment of Bonus Act, 1965) ఉండేది. దీని ప్రకారమే అర్హులైన ఉద్యోగులకు నిబంధనల ప్రకారం బోనస్ చెల్లించడం కంపెనీలకు విధిగా ఉండేది. అయితే, కొత్త లేబర్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత, బోనస్‌కు సంబంధించిన నిబంధనలన్నీ ‘కోడ్ ఆన్ వేజెస్, 2019’ (Code on Wages, 2019) పరిధిలోకి వచ్చాయి. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో బోనస్‌కు సంబంధించిన చట్టపరమైన నిబంధనలను సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
Also Read
- The Traitors Telugu: "ది ట్రైటర్స్" తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
- Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
- IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
- Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
అయితే కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరికీ ఆటోమేటిక్‌గా బోనస్ వచ్చేస్తుందనుకోవడం పొరపాటే. ఉద్యోగి జీతం (Salary), పనిచేసిన కాలం (Work Duration), కంపెనీ అర్హత ప్రమాణాలు, లేబర్ రూల్స్ ఆధారంగానే బోనస్ వర్తిస్తుంది. అర్హత ఉన్న ఉద్యోగులకు చట్టప్రకారం నిర్ణీత నిబంధనల మేరకు కనీస బోనస్ (Minimum Bonus) అందించాల్సి ఉంటుంది. పాత చట్టం ప్రకారం అర్హులైన ఉద్యోగులకు కనీసం 8.33 శాతం నుంచి గరిష్టంగా 20 శాతం వరకు బోనస్ ఇచ్చేలా నిబంధన ఉండేది. కొత్త చట్టం ప్రకారం వేతన పరిమితి (Wage Ceiling) ఆధారంగా అర్హతలు మారుతుంటాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. దీపావళికి ప్రత్యేకంగా అదనపు బోనస్ ఇవ్వాలని ఏ చట్టమూ ప్రతి కంపెనీని కచ్చితంగా ఆదేశించదు. దీపావళి పండుగ బోనస్ అనేది పూర్తిగా కంపెనీ హెచ్ఆర్ (HR) పాలసీ, మీ నియామక పత్రంలో పేర్కొన్న షరతులపై ఆధారపడి ఉంటుంది. చట్టపరంగా వచ్చే వార్షిక బోనస్‌కు, కంపెనీలు పండగ సమయంలో ఇచ్చే అదనపు బోనస్‌కు చాలా తేడా ఉంటుంది.
ఒకవేళ చట్టపరంగా అర్హత ఉన్న ఉద్యోగికి కంపెనీ విధిగా ఇవ్వాల్సిన బోనస్ ఇవ్వకపోతే, సదరు సంస్థపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఈ అంశంపై పూర్తి విచారణ జరిపిన తర్వాత కంపెనీకి జరిమానా (Fine) విధించడంతో పాటు ఇతర చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బాధ్యులైన అధికారులపై శిక్షాత్మక చర్యలు ఉండే అవకాశం కూడా ఉంది. అయితే, బోనస్ ఇవ్వలేదన్నంత మాత్రాన వెంటనే బాస్‌ను నేరుగా జైలుకు పంపించేస్తారని అనుకోవడం పొరపాటు. ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఆయా పరిస్థితులు, లేబర్ లా (Labor Laws) నిబంధనలపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఇక, అర్హత ఉన్నప్పటికీ కంపెనీ మీకు బోనస్ ఇవ్వకపోతే ఉద్యోగులు ముందుగా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ (HR Department) లేదా కంపెనీ మేనేజ్మెంట్ను సంప్రందించి రాతపూర్వకంగా (Written Request) సమాచారం కోరాలి. ఒకవేళ అక్కడి నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోతే, సంబంధిత లేబర్ డిపార్ట్మెంట్ (Labor Department) లేదా లేబర్ ఆఫీసర్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేయవచ్చు.
తాజావార్తలు
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
Illegal Mining : అక్రమ మైనింగ్‌కు చెక్.. ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు
-
OBC Reservation : ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీం కీలక తీర్పు.. ఎవరికి వర్తిస్తుంది.?
-
Reliance Foundation: తుఫాన్ బాధిత మత్స్యకారులకు అండగా రిలయన్స్ ఫౌండేషన్.. పడవల వెలికితీతకు చర్యలు..
-
Anaswara Rajan: బన్నీ మలయాళ హీరో అనుకున్నా.. ఆ హీరోయిన్ క్రేజీ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!