The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Traitors Telugu Season 1 Winner: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతున్న పాపులర్ రియాలిటీ షో ‘ది ట్రైటర్స్’ తెలుగు సీజన్ 1 ముగిసింది. ఎన్నో మలుపులు, అనుమానాలు, వ్యూహాలు, మోసాలతో సాగిన ఈ ఆటలో చివరకు శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి విజేతలుగా నిలిచారు. వీరిద్దరూ కలిసి రూ.42,77,000 ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నారు.
20 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో మొదట శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి ఇద్దరూ ఇన్నోసెంట్స్గా గేమ్‌లోకి అడుగుపెట్టారు. అయితే ఆట మధ్యలో జరిగిన పరిణామాలతో వీరిద్దరూ ట్రైటర్స్గా మారారు. రహత్, ఆశికా ద్వారా స్వీకర్ ట్రైటర్గా మారగా.. బ్లాక్మెయిల్ ఆహ్వానం ద్వారా శ్రావ్య కూడా ట్రైటర్స్ టీమ్‌లో చేరింది. అప్పటి నుంచి తమ అసలు గుర్తింపును దాచిపెడుతూ తెలివిగా గేమ్ ఆడారు. ఫైనల్ ఎపిసోడ్లో తేజ సజ్జా చివరి మర్డర్‌కు గురైన ప్రణవ్ గురించి వెల్లడించారు. మరోవైపు ధనుంజయ్.. శ్రావ్య, స్వీకర్లపై అనుమానం వ్యక్తం చేస్తూ వారిని బయటపెట్టేందుకు ప్రయత్నించాడు. శ్రావ్యను స్వీకర్‌ను బయటకు పంపించి ఒంటరిగా విజయం సాధించాలని కూడా సూచించాడు. అయితే మిగతా కంటెస్టెంట్లు అతడి అనుమానాలను పట్టించుకోలేదు. దీంతో ఫైనల్ రింగ్ ఆఫ్ డౌట్లో ధనుంజయ్ ఎలిమినేట్ అయ్యాడు.
Also Read
- Rudravanam PS: మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. అక్టోబర్ 30 నుంచి ‘రుద్రవనం పీఎస్’ స్ట్రీమింగ్.!
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
చివరకు శ్రావ్య, స్వీకర్, వర్ష, మేఘనాథ్ మాత్రమే మిగిలారు. తొలుత వర్ష ఎలిమినేట్ కాగా.. చివరగా ట్రస్ట్ లేదా డౌట్ ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేఘనాథ్ డౌట్‌ను ఎంచుకోగా.. శ్రావ్య, స్వీకర్ ట్రస్ట్‌ను ఎంచుకున్నారు. దీంతో వీరిద్దరూ ట్రైటర్స్ అని అసలు నిజం బయటపడింది. ఇన్నోసెంట్స్గా ఆట ప్రారంభించిన ఇద్దరూ చివరకు ట్రైటర్స్గా మారి విజేతలుగా నిలిచారు. విజయం అనంతరం శ్రావ్య మాట్లాడుతూ.. మొదట మూడు ఎపిసోడ్ల వరకు అయినా కొనసాగాలని అనుకున్నానని, చివరకు విజేతగా నిలుస్తానని ఊహించలేదని తెలిపింది. ఈ ప్రయాణంలో ఎన్నో స్నేహాలు సంపాదించుకోవడం తనకు పెద్ద విజయమని పేర్కొంది. అయితే గెలుపు కోసం తనకు ఇష్టమైన వ్యక్తులను బాధపెట్టాల్సి రావడం కొంత బాధ కలిగించిందని చెప్పింది.
మరోవిజేత స్వీకర్ మాట్లాడుతూ.. మొదటి నుంచి ప్రతి ఒక్కరినీ గమనిస్తూ.. వారి ప్రవర్తనను అర్థం చేసుకుంటూ గేమ్ ఆడానని వెల్లడించాడు. శ్రావ్యను తనతో కలుపుకోవడం గేమ్‌లో తీసుకున్న అతిపెద్ద నిర్ణయమని, చివరి వరకు ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచడం వల్లే విజయం సాధ్యమైందని తెలిపాడు. SOL Production నిర్మించిన ‘ది ట్రైటర్స్ తెలుగు’ సీజన్ 1 ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ షోను తెలుగుతో పాటు ఇంగ్లీష్ సబ్టైటిల్స్తోనూ వీక్షించవచ్చు.
the final betrayal awaits 👀🔥
#TheTraitorsTeluguOnPrime, Finale Episode Out, Watch Now https://t.co/SUAhtf2i3s
@tejasajja123 https://t.co/gQZuPZzkMO
— prime video IN (@PrimeVideoIN) November 5, 2026
తాజావార్తలు
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Measles: గాల్లో వైరస్..30ఏళ్ల తర్వాత అదే ముప్పు!
-
Basil Joseph: ఆఫర్స్ లేక కాదు.. కావాలనే యాక్టింగ్‌కు బ్రేక్.. బాసిల్ పెద్ద ప్లానే!
-
Minister Anam Ramanarayana Reddy: విక్రమ్ రెడ్డిపై మంత్రి ఆనం తీవ్ర వ్యాఖ్యలు.. నా జోలికొస్తే ఆకు చించి విస్తరాకు చేస్తా!
-
Vijay Sethupathi: విజయ్ సేతుపతి.. తొలి భారతీయ నటుడిగా అరుదైన ఘనత!
ట్రెండింగ్
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!