Kalyan Padala : బిగ్ బాస్ విన్నర్ హీరోగా ‘హారర్ కామెడీ’ మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ హౌస్‌లో తనదైన ఆటతీరుతో టైటిల్ గెలుచుకున కళ్యాణ్ పడాల.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. బిగ్ బాస్ విన్నర్ ఇమేజ్‌తో ఏకంగా ఒక హారర్ కామెడీ చిత్రాన్ని ఎంచుకుని టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వస్తున్నాడు. వింధ్యా ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి. సంతోషి రెడ్డి నిర్మాణంలో, నూతన దర్శకుడు హేమంత్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘ఫన్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు చేశారు. బుధవారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా, అత్యంత ఘనంగా ప్రారంభమైంది. టైటిల్ ‘ఫన్’ అని పెట్టి.. జానర్ మాత్రం ‘హారర్ కామెడీ’గా ఎంచుకోవడం చూస్తుంటే, ప్రేక్షకులను భయపెడుతూనే కడుపుబ్బా నవ్వించడానికి మేకర్స్ ఏదో గట్టి ప్లానే వేసినట్లు అర్థమవుతోంది.
నవంబర్ 12 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరగనుంది. ఎక్కడా రాజీ పడకుండా చిత్రీకరణ పూర్తి చేసి, వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కళ్యాణ్ పడాల హీరోగా నటిస్తున్న ఈ విభిన్నమైన చిత్రంలో సాహితి హీరోయిన్గా నటిస్తోంది. అలాగే విలక్షణ నటుడు అజయ్ ఘోష్, రవి శివ తేజ, వి.యశోర, సోనియా నాయుడు, జె.డి.వి ప్రసాద్, బేబీ జస్విత, మాస్టర్ హనీష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అజయ్ ఘోష్ లాంటి సీనియర్ నటుడు ఉండటంతో సినిమాలో కామెడీ, ఇంటెన్సిటీ డోస్ కచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని తెలుస్తోంది. ఈ హారర్ కామెడీకి రామ్ గోపాల్ సంగీతం సమకూరుస్తుండగా.. జి.ఎల్ బాబు సినిమాటోగ్రాఫర్‌గా, క్రాంతి (ఆర్.కె.) ఎడిటర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని క్రేజీ అప్డేట్స్ను వరుసగా రివీల్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
Also Read
తాజావార్తలు
-
Kalyan Padala : బిగ్ బాస్ విన్నర్ హీరోగా ‘హారర్ కామెడీ’ మూవీ
-
Sandiyar First Look: ‘సండియార్’ ఫస్ట్ లుక్ చూశారా? రఫ్ అండ్ రా లుక్‌తో కమల్ విధ్వంసం!
-
Vivek Chepuri : హీరోగా ఎంట్రీ ఇస్తున్న విలన్
-
India vs New Zealand: రేపే భారత్-కివీస్ రెండో వన్డే.. జట్టులోకి సిరాజ్ భాయ్ ఎంట్రీ.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
Hyderabad: ప్రజాప్రతినిధులకే ‘టోకరా’.. నిత్య కిలాడీ బాలాజీ నాయుడు అరెస్ట్!
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!