‘ఆర్ఆర్ఆర్’ సినిమాని దసరాకు జనం ముందుకు తీసుకొచ్చేద్దామని రాజమౌళి డిసైడ్ అయ్యాడు. మరింక ప్రమోషన్స్ హడావిడి కూడా ఉండాల్సిందే కదా! అఫీషియల్ గా తమ మల్టీ స్టారర్ కోసం ఎన్టీఆర్, చరణ్ ప్రచారం మొదలు పెట్టకున్నా రోజూ ఏదో ఒక విధంగా ‘ట్రిపుల్ ఆర్’ ట్రెండింగ్ లో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఉక్రెయిన్ నుంచీ షూటింగ్ తాలూకూ పిక్స్ అప్ లోడ్ చేయటం, హీరోలిద్దరూ డైరెక్టర్ తో కలసి ఫ్రీ టైంలో చిల్ అవుతోన్న వీడియో బయటపెట్టడం… ఇవన్నీ అ కోవలోనివే! తాజాగా కొద్ది రోజుల కోసం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ అఫీషియల్ ఇన్ స్టా అకౌంట్ తారక్ తన చేతిలోకి తీసేసుకున్నాడు. అంతే కాదు, ఫస్ట్ వీడియోని కూడా పోస్ట్ చేశాడు ‘భీమ్’…
Read Also : దుమ్మురేపుతున్న “సర్కారు వారి పాట” టీజర్
‘మా ‘భీమ్’ కొద్ది రోజులు ఇన్ స్టాగ్రామ్ ని టేకోవర్ చేస్తున్నాడు’ అంటూ మేకర్స్ అనౌన్స్ చేసిన గంటల వ్యవధిలోనే తొలి వీడియోతో ఫ్యాన్స్ కి ట్రీట్ అందించాడు జూనియర్. ‘డ్రమ్స్ ప్రాక్టీస్ ఏమైందంటూ’ ఎన్టీఆర్ ప్రశ్నించగా ‘అయిపోయింది’ అంటూ చరణ్ సమాధానమిచ్చాడు. ‘ఆర్ఆర్ఆర్’ లెటెస్ట్ బిహైండ్ ద సీన్స్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది…
A post shared by RRR Movie (@rrrmovie)