‘ఆర్ఆర్ఆర్’ సినిమాని దసరాకు జనం ముందుకు తీసుకొచ్చేద్దామని రాజమౌళి డిసైడ్ అయ్యాడు. మరింక ప్రమోషన్స్ హడావిడి కూడా ఉండాల్సిందే కదా! అఫీషియల్ గా తమ మల్టీ స్టారర్ కోసం ఎన్టీఆర్, చరణ్ ప్రచారం మొదలు పెట్టకున్నా రోజూ ఏదో ఒక విధంగా ‘ట్రిపుల్ ఆర్’ ట్రెండింగ్ లో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఉక్రెయిన్ నుంచీ షూటింగ్ తాలూకూ పిక్స్ అప్ లోడ్ చేయటం, హీరోలిద్దరూ డైరెక్టర్ తో కలసి ఫ్రీ టైంలో చిల్ అవుతోన్న వీడియో బయటపెట్టడం……
రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్” మూవీ ప్రమోషన్ బాధ్యతలను “భీమ్”కు అప్పజెప్పారు. “ఆర్ఆర్ఆర్” మూవీ షూటింగ్ ప్రస్తుతం ఉక్రెయిన్ లో జరుగుతోంది. అక్కడ సినిమాలోని ఓ పాటకు సంబంధించి ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. అందులో ప్రధాన తారాగణంపై చిత్రీకరణ జరుగుతోంది. ఇక సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుండడంతో మూవీ ప్రమోషన్లపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాలో నుంచి మేకింగ్ వీడియోతో పాటు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా విడుదలైన “దోస్తీ”…