యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్యాప్ లేకుండా సినిమాలను సెట్స్ పైకి తీసుకువెళుతున్నాడు. దేవర తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ లో సత్తా చాటాడు. అదే జోష్ తో బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్ 2 ను కూడా ఫినిష్ చేసారు. ఇక తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రశాంత్ నీల్ సినిమాను మొదలు పెట్టాడు టైగర్. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
Also Read : Daaku Maharaaj : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసిన డాకు మహారాజ్
తాజాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో స్టార్ట్ చేసాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాకు సంబందించి అల్లర్లు , రాస్తారోకో షాట్స్ తీస్తున్నారు. నెల రోజులు తారక్ లేని సీన్స్ ను షూట్ చేయనున్నారు. మర్చి నెలాఖరు నుండి యంగ్ టైగర్ షూట్ లో జాయిన్ కానున్నారని సమాచారం. షూట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసి ఎక్కువ భాగం పోస్ట్ ప్రొడక్షన్ పై ఎక్కువ టైం స్పెంట్ చేయబోతున్నారట ప్రశాంత్ నీల్. కాగా ఈ సినిమా కథ 1960లో బెంగాల్ నేపధ్యంలో సాగుతుందట. ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని గతంలో ప్రశాంత్ నీల్ తెలిపాడు. అందుకు తగ్గట్టే ఎన్టీఆర్‌ను అత్యంత శక్తివంతమైన పాత్రలో ఆవిష్కరిస్తూ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా ప్రశాంత్‌నీల్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ సెన్సేషన్ రవి బస్రుర్ ఎన్టీఆర్ నీల్ సినిమాకు సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీస్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.