Daaku Maharaaj : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసిన డాకు మహారాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మాసివ్ పవర్ ప్యాక్డ్ మూవీ ‘డాకు మహారాజ్’. ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్‌తో అదరగొడుతోంది. పది రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 170 కోట్లకు పైగా వరకు గ్రాస్, రూ.85 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ రాబట్టింది. లాంగ్ రన్‌లో వంద కోట్ల షేర్ కలెక్షన్స్‌ను డాకు మహారాజ్ ఈజీగా రాబడుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాతో బాలయ్య వరుసగా వంద కోట్లు కొల్లగొట్టిన నాలుగు సినిమాలు కలిగిన సీనియర్ హీరోగా సరికొత్త రికార్డ్ సెట్ చేశారు.
Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాల లిస్ట్ ఇదే..
Also Read
అయితే థియేటర్లో దుమ్ముదులిపిన డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అవుతుందోనని ఓటిటి డేట్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది. డాకు మహారాజ్ ను ఫిబ్రవరి 21 నుంచి అనగా ఈ రోజు నుండి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా 40 రోజుల థియేటర్ రన్ తర్వాత ఓటీటీ రిలీజ్ కు వచ్చింది. సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం ఇటీవల కాలంలో బెస్ట్ మ్యూజిక్ అనే చెప్పాలి.
తాజావార్తలు
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!