యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న ప్యూర్ కమర్షియల్ సినిమా ‘దేవర’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ సముద్ర వీరుడిగా కనిపించనున్నాడు. తండ్రి, కొడుకు క్యారెక్టర్స్ లో డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న ఎన్టీఆర్, ఈసారి కొరటాల శివతో కలిసి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే యాక్షన్ పార్ట్ షూటింగ్ ని దాదాపు కంప్లీట్ చేసుకునే స్టేజ్ కి వచ్చిన దేవర సినిమా లేటెస్ట్ షెడ్యూల్ కూడా స్టార్ట్ అయ్యింది. ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ ఇతర కాస్టింగ్ ఉన్న ఈ షెడ్యూల్ అవగానే దేవర టాకీ పార్ట్ స్టార్ట్ కానుంది. దేవర యాక్షన్ పార్ట్ ని కంప్లీట్ చేసి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ ని ఇచ్చేస్తే రిలీజ్ డేట్ సమయానికి క్వాలిటీ గ్రాఫిక్స్ వర్క్ జరుగుతుందనేది కొరటాల శివ ప్లాన్.
దేవర రిలీజ్ డేట్ విషయానికి వస్తే మేకర్స్ ఇప్పటికే 2024 ఏప్రిల్ 5న దేవర సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ఏప్రిల్ 5,6,7 వీకెండ్స్… 9న ఉగాది ఫెస్టివల్, 11న ఈద్ ఫెస్టివల్, 14న అంబెడ్కర్ జయంతి, 17న శ్రీరామ నవమి… 18 నుంచి మళ్లీ మూడు రోజుల పాటు వీకెండ్ స్టార్ట్ అవనుంది… అంటే ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 21 వరకూ దేవర సినిమాకి పండగలతో వీకెండ్స్ తో బ్యాక్ టు బ్యాక్ సెలవలు ఉన్నాయి…. మధ్యలో ఒకటి రెండు వర్కింగ్ డేస్ ఉన్నా కూడా దాదాపు 16 రోజుల పాటు హాలిడేస్ దేవర సినిమాకి కలిసి రానున్నాయి. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసి దేవర సినిమా రిలీజ్ డేట్ ని లాక్ చేసినట్లు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న అంచనాలకు తగ్గట్లు కొరటాల శివ-ఎన్టీఆర్ దేవర సినిమాకి పాజిటివ్ టాక్ ని కూడా రాబడితే మాత్రం దేవర సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ లో ఒక కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేయడం గ్యారెంటీ.