ట్రిపుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజులో చేస్తున్న సినిమా ‘ఎన్టీఆర్ 30’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ అనౌన్స్మెంట్ తోనే సాలిడ్ బజ్ జనరేట్ చేసింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని 2024 ఏప్రిల్ లో రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకున్న ‘ఎన్టీఆర్ 30’లో సైఫ్ అలీ ఖాన్ నెగటివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. రీసెంట్ గా హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో సైఫ్ అలీఖాన్, ఎన్టీఆర్ ల మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేశాడు కొరటాల శివ. ఎన్టీఆర్ సరసన హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ పాన్ ఇండియా సినిమాతో అమ్మడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. అయితే జాన్వీతో పాటు మరో హీరోయిన్‌కు కూడా ఎన్టీఆర్ 30లో స్కోప్ ఉందట. అందుకోసం ఇప్పటికే పలువురు ముద్దుగుమ్మల పేర్లు వినిపించాయి. క్యూట్ బ్యూటీ కృతిశెట్టి పేరు కూడా వినిపించింది కానీ ఇప్పుడు ఊహించని హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఆమె ఇంకెవరో కాదు ఎలాంటి పాత్రలో అయినా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేసి ఆడియన్స్ చేత మహానటి అనిపించుకున్న ‘లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి’. ఇప్పుడే కాదు.. గతంలోను ఆమె స్టార్ హీరోల సరసన రొమాన్స్ చేయబోతున్నట్టు ప్రచారం చేశారు కానీ ఇప్పటివరకూ సాయి పల్లవికి సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ రాలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ ఫిల్మ్ ‘పుష్ప2’లో అయితే.. సాయి పల్లవి ఏకంగా షూటింగ్‌లో కూడా జాయిన్ అయిందనే పుకార్లు వచ్చాయి.
ఇక ఇప్పుడేమో ఎన్టీఆర్30లో సాయి పల్లవి నటిస్తుందనే టాక్ ఊపందుకుంది. నిజానికి జాన్వీ కపూర్ కన్నా ముందే ఎన్టీఆర్ 30లో మెయిన్ హీరోయిన్‌గా సాయి పల్లవి ఫిక్స్ అయిందన్నారు. ఇప్పుడేమో జాన్వీ కపూర్ మెయిన్, సాయి పల్లవి సెకండ్ లీడ్ అంటున్నారు. ఎన్టీఆర్ రెండు పాత్రల్లో నటిస్తున్నాడు అందులో ఒక పాత్రకి జాన్వీ కపూర్ హీరోయిన్ అయితే ఇంకో పాత్రకి సాయి పల్లవి హీరోయిన్ అని న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ వార్త నిజమై సాయి పల్లవి ‘ఎన్టీఆర్ 30’లో జాయిన్ అయితే మాత్రం జాన్వీ కపూర్ కి గట్టి దెబ్బ పడే ఛాన్స్ ఉంది. సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ ముందు జాన్వీ కపూర్ తేలిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. మరి కొరటాల శివ ఒకవేళ సాయి పల్లవిని కాస్ట్ చేస్తే జాన్వీ కపూర్ ని ఎలా బాలన్స్ చేస్తాడు అనేది చూడాలి. జాన్వీ కపూర్ విషయం పక్కన పెడితే ఎన్టీఆర్-సాయి పల్లవి లాంటి పెర్ఫర్మార్స్ కలిసి కనిపిస్తే ఆన్ స్క్రీన్ విజువల్ ట్రీట్ లా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.