మే నెల వస్తే అందరూ ఎండలకి భయపడుతూ ఉంటారు కానీ ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం ఈసారి తారక్ బర్త్ డేని ఎలా సెలబ్రేట్ చెయ్యలా అనే జోష్ లో ఉంటారు. సాలిడ్ సెలబ్రేషన్స్ మోడ్ లో ఉండే ఎన్టీఆర్ ఫాన్స్ కి, ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాల నుంచి కూడా అప్డేట్స్ బయటకి రావడంతో అభిమానుల జోష్ మరింత పెరుగుతూ ఉంటుంది. ప్రతి ఏటా ఆనవాయితీగా జరిగే ఈ ప్రోగ్రామ్ ఈసారి మాత్రం మరింత గ్రాండ్ గా జరగనుంది. ఎందుకంటే దాదాపు అయిదేళ్ల తర్వాత ఎన్టీఆర్ నటించిన ఒక సినిమా అప్డేట్, ఎన్టీఆర్ బర్త్ డే రోజున బయటకి రాబోతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో ‘ఎన్టీఆర్ 30’ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ పాన్ ఇండియా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్ గా మేకర్స్ రిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఆరోజే ‘ఎన్టీఆర్ 30’ ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని ఫాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ ఒకసారి హిస్టరీ చూస్తే అది తప్పని, ఆరోజు ఫస్ట్ లుక్ రాదని క్లియర్ గా తెలుస్తుంది.
Read Also: NTR 30: ఈ నెలంతా సోషల్ మీడియా హోరెత్తిపోవడం ఖాయం
గత ఏడేళ్ళుగా ఎన్టీఆర్ నటించిన సినిమాల నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్స్ అన్నీ మే 19నే రిలీజ్ అయ్యాయి, అంటే ఒకరోజు ముందే ఫాన్స్ కి ట్రీట్ ఇచ్చాయి అనమాట. జనతా గ్యారేజ్ నుంచి సాలిడ్ గా మొదలైన ఈ ట్రెండ్ అరవింద సమేత వీర రాఘవ వరకూ జరిగింది. 2016, 2017, 2018ల్లో మే 19న ఎన్టీఆర్ నటించిన సినిమాల ఫస్ట్ లుక్స్ మే 19నే రిలీజ్ అయ్యాయి కానీ ఆ తర్వాత నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఫస్ట్ లుక్ మాత్రం అక్టోబర్ నెలలో రిలీజ్ అయ్యింది. ఈ లెక్కన దాదాపు అయిదేళ్ల తర్వాత ఎన్టీఆర్ నటించిన ఒక సినిమా నుంచి తన బర్త్ డే రోజున ఒక అప్డేట్ బయటకి రానుంది. మరి మే 19న మాస్ జాతర మొదలుపెట్టి మే 20 అర్ధరాత్రి వరకూ ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో చెయ్యబోయే హంగామా ఎలా ఉంటుందో చూడాలి.