Niharika Konidela React on Divorce with Chaitanya Jonnalagadda: మెగా డాటర్ నిహారిక కొణిదెల తన భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి విడిపోయారని కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. నిహారిక-చైతన్య తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. ఈ న్యూస్ అఫీషియల్‌గా కన్ఫామ్ అయ్యింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. నిహారిక, చైతన్యల మధ్య మనస్పర్థలు తలెత్తడంతోనే విడాకులు తీసుకున్నారు. తాజాగా ఈ విడాకులపై నిహారిక స్పందించారు.
‘చైతన్య జొన్నలగడ్డ, నేను పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం. ఇది చాలా సున్నితమైన విషయం. ఇద్దరం కొత్తగా ప్రారంభించే వ్యక్తిగత జీవితంలో ప్రైవసీని కోరుకుంటున్నాం. ఈ కష్ట సమయంలో నా వెంట పిల్లర్స్‌లా నిలబడిన ఫ్యామిలీ, స్నేహితులకు ధన్యవాదాలు. అందరినీ ఓ రిక్వెస్ట్.. మాపై నెగటివ్‌గా ప్రచారం చేయొద్దు. దకయచేసి మమల్ని ఇబ్బంది పెట్టకండి. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా’ అని నిహారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ పరస్పర అంగీకారంతో నెల రోజుల కిందటే విడాకుల కోసం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. కోర్టు ఇటీవల వారిద్దరికి విడాకులు మంజూరు చేసింది. మంగళవారం (జూన్ 4) విడాకుల న్యూస్ అఫీషియల్‌గా బయటికి వచ్చింది. నెల రోజుల తర్వాత ఈ న్యూస్ బయటికి వచ్చింది. విడాకుల అంశంపై నెట్టింట నెగటివ్ కామెంట్లు వస్తుండటంతో నిహారిక ఈరోజు ఇన్‌స్టా వేదికగా స్పందించారు.
నాగబాబు కూతురు నిహారిక కొణిదెల, గుంటూరు ఐజీ జె ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డకు 2020 ఆగస్టులో నిశ్చితార్థం జరిగింది. 2020 డిసెంబరులో వీరి పెళ్లికి రాజస్థాన్ ఉదయపూర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే రెండేళ్లకే వీరి పెళ్లి బంధం పెటాకులైంది. వివాహం అనంతరం సినిమాలకు దూరమైన నిహారిక తాజాగా ‘డెడ్ పిక్సెల్స్’ అనే వెబ్ సిరీస్‌తో ఎంట్రీ ఇచ్చారు. ఇక నుంచి సినిమాలపై పూర్తి ఫోకస్ చేయనున్నారు.
Also Read: Salaar Movie Updates: సలార్ టీజర్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. అభిమానులకు పండగే ఇగ!