నేషనల్ క్రష్ గా తెలుగువారి గుండెల్లో నిలిచిపోయింది రష్మిక మందన్న.. అమ్మడి అందచందాలకు ఫిదా అయిపోయిన అభిమానులు పుష్ప లోని డీ గ్లామరైజ్డ్ శ్రీవల్లి పాత్రను నెత్తిన పెట్టుకొన్నారు. శ్రీవల్లీ పాటలో రష్మిక నటన అద్భుతమని పొగిడేస్తున్నారు. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకొంది. అందులో సామీ సామీ సాంగ్ రష్మికకు ఎంతో పేరు తెచ్చింది. ఈ స్టెప్ తో అమ్మడు మాములు రచ్చ చేయడం లేదు. భాష ఏదైనా.. వేడుక ఎక్కడైనా సామీ సామీ స్టెప్ మాత్రం రష్మిక మర్చిపోవడం లేదు.
పుష్ప ప్రమోషన్స్ మొదలుపెట్టిన దగ్గర నుంచి నిన్న జరిగిన సక్సెస్ పార్టీ వరకు రష్మిక సామీ సామీ స్టెప్ లేకుండా మాత్రం ప్రోగ్రామ్ ఎండ్ అవ్వడం లేదు. ఇక దీనిపై నెటిజెన్స్ ఆడుకుంటున్నారు. ఏమ్మా రష్మిక స్టెప్ తప్ప ఇంకేం మాట్లాడవా..? అని కొందరు.. మాకు రష్మిక స్పీచ్ వద్దు స్టెప్ మాత్రమే కావాలి అంటూ ఆడేసుకుంటున్నాడు. ఇంకొంతమంది ఎక్కడపడితే అక్కడ ఏంటి ఇది రష్మిక అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం రష్మిక స్టెప్స్ పై మీమ్స్ నెట్టింట వైరల్ గా మారాయి.