న్యూ ఇయర్ కానుకగా తన నెక్స్ట్ సినిమా ‘నాని 30’ అప్డేట్ ని ఇచ్చిన నాని, తన ఫాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చాడు. ఇదే జోష్ లో ఫ్యాన్ మీట్ ఏర్పాటు చేసిన నాని, తన అభిమానులతో ఫోటో సెషన్ చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం నాని ఇలానే తన అభిమానులతో టైం స్పెండ్ చేస్తున్నాడు. 2023 స్టార్టింగ్ లోనే జరుగుతున్న ఈ ఫ్యాన్ మీట్ కోసం నాని అభిమానులంతా యూసఫ్ గూడలోని ‘గ్రాండ్ గార్డెన్స్’కి క్యు కట్టారు. ‘దసరా’ గెటప్ లో నాని ఫోటో సెషన్ కి వచ్చి ఫాన్స్ తో ఫోటోలు దిగుతున్నాడు. మార్చ్ 30న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ‘దసరా’ సినిమా ప్రమోషన్స్ కి కిక్ స్టార్ట్ లాంటిదే ఈ ఫాన్స్ మీట్ అని చెప్పొచ్చు. దసరా రిలీజ్ కి మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది కాబట్టి ఫాన్స్ మీట్ నుంచే ప్రమోషన్స్ ని మొదలుపెట్టారు.
నాని కెరీర్ లోనే ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమాగా రూపొందుతున్న ‘దసరా’ సినిమా నుంచి ‘దోస్తాన్’ సాంగ్ రిలీజ్ అయ్యి సూపెర్ హిట్ అయ్యింది. ఈ పాట తర్వాత దసరా సినిమా నుంచి పెద్దగా అప్డేట్స్ బయటకి రాలేదు. ఇకపై మాత్రం ఆ గ్యాప్ ని ఫైల్ చేస్తూ ఫ్రీక్వెంట్ గా దసరా అప్డేట్స్ బయటకి వచ్చే ఛాన్స్ ఉంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ‘దసరా’ సినిమాని ‘శ్రీకాంత్ ఓడెల’ డైరెక్ట్ చేస్తుండగా, సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ బాలన్స్ ఉన్న ‘దసరా’ సినిమాకి సంతోష్ నారాయణ్ ఇచ్చిన మ్యూజిక్ మెయిన్ హైలైట్ అవనుందని సమాచారం. సింగరేణి కోల్ మైన్స్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ రా అండ్ రస్టిక్ ‘దసరా’తో నాని పాన్ ఇండియా హీరో అవుతాడో లేదో చూడాలి.