Hit3 : నేచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్న మూవీ హిట్-3 ది థర్డ్ కేస్. హిట్ సిరీస్ లో వస్తున్న ఈ సినిమాకు మొదటి నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. ఇప్పటికే రెండు వచ్చిన రెండు పార్టులు మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు మూడో పార్టు రాబోతోంది. శైలేష్ కొలను డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక తాజాగా హిట్-3 ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. మెలోడీ క్లాసిక్ ఉన్న ఈ పాట చాలా ఆకట్టుకుంటోంది. నాని, శ్రీనిధి నడుమ లవ్ సాంగ్ గా ఇది వస్తోంది.
Read Also : Hyderabad: మండి రెస్టారెంట్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు.. పాడైపోయిన చికెన్, బొద్దింకలు దర్శనం
ప్రేమ వెల్లువ అంటూ సాగే ఈ పాటను శైలేష్ సిధ్ శ్రీరామ్, నూతన మోహన్ కలిసి పాడారు. ఈ పాట గ్లింప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో నాని, శ్రీనిధి చాలా రొమాంటిక్ టచ్ ఇచ్చారు. చూడటానికి సింపుల్ గా సాగిపోతోంది. ఈ సినిమాలో నాని చాలా వైలెంటిగ్ గా కనిపిస్తున్నాడు. ఈ మూవీని మే1 న రిలీజ్ చేయబోతున్నారు. భారీ హైప్ నడుమ వస్తున్న ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాలని నాని చూస్తున్నాడు.