న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అంటే సుందరానికీ సినిమాను పూర్తి చేసిన నాని ప్రస్తుతం దసరా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక ఈ చిత్రంలో నాని సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయితాజాగా ఈ సినిమా షెడ్యూల్ పెద్ద పల్లి జిల్లాలోని గోదావరి ఖనిలో జరుగుతోంది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీలో నాని, కీర్తి సురేష్‌లపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు.
భగభగ మండుతున్న ఎండల్లో నాని, కీర్తి సురేష్ మధ్య రొమాంటిక్ సాంగ్ నితెరకెక్కిస్తున్నారు.బొగ్గుగని నేపథ్యంలో చిత్రీకరిస్తున్న ఈ పాట కోసం టీమ్ అంతా చాలా శ్రమిస్తోందట.మొత్తం 500 మంది డాన్సర్లు ఈ షూట్ లో పాల్గొన్నారట. నాని కెరీర్ లోనే మొదటిసారి పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్ లో నాని రగ్గడ్ లుక్ ఆకట్టుకుంది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాతో నాని హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.