Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వీరసింహారెడ్డి రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. నేడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. ఇక ఈ సినిమాలో బాలయ్య 45 ఏళ్ళ వయస్సు ఉన్న తండ్రి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలకృష్ణ కూతురిగా శ్రీ లీల నటిస్తోంది. కాగా, ఈ సినిమా టైటిల్ లీక్ అంటూ నెట్టింట వార్తలు గుప్పుమంటున్నాయి.
ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా “బ్రో ఐ డోంట్ కేర్” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట. ఈ చిత్రంలో బాలయ్య ఎవరికి భయపడని వ్యక్తిగా ఉండడంతో పాటు కొద్దిగా కామెడీ కూడా చేస్తుంటాడట.. అందుకే ఈ సినిమాకు ఆ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే బలయ్యాకు ఈ టైటిల్ సెట్ అవుతుందా..? అని అభిమానులు గుసగుసలాడుతున్నారు. పవర్ ఫుల్ టైటిల్స్ లోనే బాలయ్యను ఎక్కువా చూసిన అభిమానులు ఈ ఇంగ్లీష్ టైటిల్ తో సంతృప్తి చెందుతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.