Naga Shaurya Gets Angry With Journalists Questions In Rangabali Successmeet: ఈమధ్య సెలెబ్రిటీలకు ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగడం జర్నలిస్టులకు ఒక ప్యాషన్ అయిపోయింది. అలాంటి ప్రశ్నలు అడగడం వల్ల ఫేమస్ అయిపోతామనో, లేక మరే ఇతర కారణమో తెలీదు కానీ.. గుచ్చి గుచ్చి కొన్ని ప్రశ్నల్ని మాత్రం సంధిస్తుంటారు. అది వ్యక్తిగతం కావొచ్చు, సినిమాలకు సంబంధించినవి కావొచ్చు. ఇలాంటప్పుడు ఏ సెలెబ్రిటీకి అయినా కోపం రావడం సహజం. చాలామంది తమ కోపాన్ని అణచుకొని, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తారు. కానీ, కొందరు మాత్రం సహనం కోల్పోతుంటారు. ఇప్పుడు యువ హీరో నాగశౌర్య కూడా తన సహనం కోల్పోయాడు. తన ‘రంగబలి’ సక్సెస్‌మీట్‌లో భాగంగా ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అతడు నొచ్చుకొని.. సీరియస్‌గా వేదిక మీద నుంచి వెళ్లిపోయాడు. అయితే.. అతడు సమాధానం ఇచ్చి మరీ వెళ్లడం ఇక్కడ గమనార్హం.
Anasuya : రాత్రి పడుకొనేదే దానికోసం.. అనసూయ షాకింగ్ కామెంట్స్..
ఇంతకీ ఆ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నేమిటంటే.. ‘‘తనకు ప్రతీ విషయం తెలుసని, తన ఊరిలో చీమ చిటుక్కుమన్నా తనకు తెలుస్తుంది, తానే తోపు అంటూ ఫీలైపోయే హీరోకి.. తన ఊరికి చెందిన ‘రంగబలి’ సెంటర్ చరిత్ర ఏంటో తెలీదా?’’ అంటూ ఓ లాజికల్ ప్రశ్న అడిగాడు. అయితే.. ఆ జర్నలిస్ట్ సరిగ్గా ప్రశ్న సంధించకపోవడంతో, దర్శకుడికి అది అర్థం కాలేదు. అప్పుడు నాగశౌర్య మైక్ అందుకొని, మీ ప్రశ్న నాకు అర్థమైందంటూ తన సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. ‘‘ఆ హీరోకి ఇంకా 45, 50 ఏళ్లు రాలేదు. పంచె కట్టుకుని నలుగురిలో కూర్చొని మాట్లాడే క్యారెక్టర్ కాదు. హీరోది వెరీ యంగ్ & డైనమిక్ క్యారెక్టర్. ప్రతీది నాకే తెలుసు అనుకునే క్యారెక్టర్. ఇప్పుడు ఎవరో ఒకరు రోడ్డు వేస్తే.. ఆ రోడ్డుకి ఎందుకు ఆ పేరు పెట్టారో తెలుస్తుంది కానీ, ఆ రోడ్డు వేయడానికి గల చరిత్ర తెలుసుకోవాలనే ఐడియా ఆ వయసులో ఏ కుర్రాడికీ ఉండదు. ఇది సింబాలిక్’’ అంటూ సమాధానం ఇచ్చాడు.
Adani Iron Bridge: 90 అడుగుల ఐరన్ బ్రిడ్జ్‌ని దొంగలించిన దుండగులు.. ఎలా దొరికారంటే?
ఇలాంటివన్నీ స్టోరీలో పెట్టుకుంటూ పోతే.. తమ సినిమా 16 గంటలు, 20 గంటలు పైనే అవుతుందని కాస్త కోపంగానే రియాక్ట్ అయ్యాడు శౌర్య. ఇక బాహుబలి అయితే అడగొద్దని, అది కొన్ని సంవత్సరాలు ఉంటుందనిచెప్పాడు. కాబట్టి.. కొన్ని కొన్ని విషయాలను అర్థం చేసుకొని, వదిలేయాలంటూ సమాధానం ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ప్రెస్‌మీట్ ముగిసిందని తెలియగానే.. శౌర్య తన చేతుల్ని కొట్టుకుంటూ, స్టేజ్ మీద నుంచి వెళ్లిపోయాడు. అంతకుముందు కూడా ఓ జర్నలిస్ట్.. సెకండాఫ్‌కి మిక్స్‌డ్ టాక్ వచ్చిందని ప్రశ్నించగా, మీకెలాంటి సినిమాలు కావాలో చెప్పండి, అవే చేస్తానంటూ శౌర్య సీరియస్‌గానే జవాబిచ్చాడు. దీన్ని బట్టి.. జర్నలిస్టులు ఎలాంటి ఇబ్బందికర ప్రశ్నలు వేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.