బుల్లితెరపై తన హాట్ అందాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. యాంకర్ గా కన్నా ఇప్పుడు సోషల్ మీడియా హాట్ ఫిగర్ గా బాగా ఫెమస్ అవుతుంది.. సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ యాంకరింగ్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.. వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే అనసూయ తాజాగా విమానం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.. అంతేకాదు అభిమానులతో చిట్ చాట్ చేస్తూ వారితో సన్నిహితంగా ఉంటారు..
సినిమాల్లో గ్యాప్ దొరికితే చాలు ఫ్యామిలితో వేకెషన్స్ ను ఎంజాయ్ చేస్తుంది.. అందుకు సంబందించిన ప్రతి ఫోటోను సోషల్ మీడియాలో వదులుతుంది.. ఈ క్రమంలో తాజాగా ఈమె చేసిన పోస్ట్ కనుక చూస్తుంటే అనసూయ వీకెండ్ మూడ్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక తన డే ఎలా ప్రారంభమైందో చెబుతూ ఈమె చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఉదయాన్నే ఈమె హెల్తీ బ్రేక్ ఫాస్ట్ చేశారని తనకు నిద్ర అంటే చాలా ఇష్టమని తెలిపారు. ప్రతిరోజు రాత్రి తాను నిద్రపోయేది ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడం కోసమే అంటూ అనసూయ ఎర్లీ మార్నింగ్ లుక్ కిసంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
విమానం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనసూయ ప్రస్తుతం ఇతర సినిమా షూటింగ్ పనులలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈమె అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఈమె దాక్షాయిని పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.. మొదటి పార్ట్ లో తెల్చేసిన డైరెక్టర్ ఇప్పుడు పార్ట్ 2 లో అనసూయ పాత్రను కీలకంగా మార్చానున్నారు.. మొత్తం కథ అనసూయ చుట్టూ తిరుగుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి..