Naga Shourya: యంగ్ హీరో నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న శౌర్య ఈ మధ్యనే పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడయ్యాడు. మొదటి నుంచి శౌర్య సినిమాల్లో ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. తల్లి, చెల్లి, భార్య.. ఈ పాత్రలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాడు. ఇక బయట కూడా ఈ హీరో అలానే ఉంటాడు.. మహిళలకు గౌరవమిస్తూ ఉంటాడు. తాజాగా నడిరోడ్డుపై ఒక యువతికి జరిగిన చిన్న ఇన్సిడెంట్ ను తట్టుకోలేని కుర్ర హీరో నడిరోడ్డుపైనే రచ్చ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. నేటి ఉదయం.. శౌర్య కారులో వెళ్తుండగా.. నడిరోడ్డుపై ఒక యువకుడు.. తన లవర్ పై చేయి చేసుకున్నాడు. ఇది చూసిన నాగ శౌర్య కారు దిగి.. సదురు యువకుడిని అడ్డుకున్నాడు. నడిరోడ్డుపై అమ్మాయిని కొడతావా.. ఆ అమ్మాయికి సారీ చెప్పు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక సదురు యువకుడు తను నా లవర్ అని, తాను కొట్టలేదని చెప్పుకొచ్చాడు.
RRR: ఆస్కార్ అవార్డుల వేళ.. నిర్మాత దానయ్య మిస్సింగ్..?
ఇక ఆ అమ్మాయి కూడా తనేమి కొట్టలేదని, మమ్మల్ని వదిలేయమని అడిగింది. అయినా ఒక అమ్మయిని నడిరోడ్డుపై చేయి చేసుకోవడం ఏంటి అంటూ శౌర్య ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతనికి సపోర్ట్ గా అక్కడ ఉన్నవారు అడగడంతో యువకుడు, అమ్మాయికి సారీ చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. వాడి లవర్ వాడు కొట్టుకుంటాడు.. మీకెందుకు అని కొందరు.. మంచి పని చేశారు.. రియల్ హీరో అనిపించుకున్నారు అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ఇక ఇదేమి ప్రమోషన్ స్టంట్ అయితే కాదుగా అని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ హీరో నటించిన ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి రిలీజ్ కు రెడీ అవుతోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.