Naga Shourya: యంగ్ హీరో నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న శౌర్య ఈ మధ్యనే పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడయ్యాడు. మొదటి నుంచి శౌర్య సినిమాల్లో ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. తల్లి, చెల్లి, భార్య.. ఈ పాత్రలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాడు.