Vijay Setupathi: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర ఏదైనా.. విజయ్ దిగనంత వరకే. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, క్యామియో.. ఏదైనా సరే .. కథ నచ్చడం ఆలస్యం.. దూకేస్తాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతికి .. ఒకానొక సమయంలో చావు బెదిరింపులు వచ్చాయి. ఎందుకు అంటే .. శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ గా తెరకెక్కిన 800 సినిమాలో మొదట విజయ్ సేతుపతినే తీసుకున్నారు. పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. ఇక అప్పుడే చాలామంది విజయ్ సేతుపతికి విరుద్ధంగా ఫైర్ అయ్యారు. తమిళ వాసనలు ఉన్న ముత్తయ్య.. శ్రీలంక తరుపున ఆడినా.. తమిళ్ వారిని ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. అలాంటి వ్యక్తి స్థానంలో ఒక తమిళ నటుడు నటించడం తమను అవమానించడమే అని.. విజయ్ సేతుపతి.. ఆ పాత్ర చేయకూడదని డిమాండ్ చేశారు. కేవలం అభిమానులు మాత్రమే కాకుండా రాజకీయ నేతలు కూడా ఈ విషయంలో సీరియస్ అవ్వడంతో విజయ్.. వెనక్కి తగ్గి .. ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం మరో హీరోతో ఈ సినిమా అక్టోబర్ 6 న రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ముత్తయ్య.. ఆరోజు విజయ్ సేతుపతికి జరిగిన ఒక చేదు అనుభావాన్ని తెలిపాడు.
Skanda Release Trailer: అఖండను మించిన యాక్షన్ ఉందేంటి బ్రో..
“నేను IPLలో ఉన్న సమయంలో విజయ్ సేతుపతి షూటింగ్ కోసం అదే హోటల్‌లో బస చేసినట్లు తెలిసింది. అతను నన్ను కలవాలని అడగడంతో.. విషయం ఎంతో తెలియనప్పటికీ కలిసాను.. విజయ్ కు క్రికెట్ పై ఎంతో ఇష్టం ఉందని తెల్సింది. అలా ఐదు రోజులు .. రెండు గంటలు కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం. ఆ తరువాత స్క్రిప్ట్ గురించి చెప్పడం.. అది నాకు కూడా నచ్చడంతో 800 మొదలయ్యింది. ఇక ఆ తరువాత చాలామంది రాజకీయ నేతలు .. ఆ పాత్ర చేయొద్దు అని ఆయన్ను బెదిరించారు. ఆ సినిమాలో నటిస్తే.. కుటుంబంతో సహా చంపేస్తాం అని బెదిరించడంతో .. నేనే.. విజయ్ ను వెనక్కి వెళ్లిపొమ్మని చెప్పాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి విజయ్ లేని ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.