Skanda Release Trailer: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రం స్కంద. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. మునుపెన్నడూ చూడని రామ్ ను బోయపాటి స్కందలో చూపించాడు. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సి ఉండగా.. సలార్ సినిమా వెనక్కి తగ్గడంతో సెప్టెంబర్ 28న స్కందను రిలీజ్ కు రెడీ చేశారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఒకపక్క రామ్, ఇంకోపక్క మేకర్స్ వరుస ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు.
Salaar: బిగ్ బ్రేకింగ్.. సలార్ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. ?
ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ తో నింపేశాడు బోయపాటి. ఇంకోపక్క రామ్ మాస్ లుక్ ట్రైలర్ పై ఆసక్తిని పెంచేస్తుంది. ముఖ్యంగా బోయపాటి డైలాగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయని అభిమానులు చెప్పుకొస్తున్నారు. “మనిషికో పేరు.. ఊరుకో గౌరవం.. ప్రతి పదవికి ఒక బాధ్యత ఉంటుంది. అది మర్చిపోయి మీరు ఇద్దరు తీసిన పరువు, కూల్చేసిన ఆత్మగౌరవం తిరిగి మీరే నిలబెట్టాలి” అంటూ సాగే డైలాగ్స్ థియేటర్లో విజిల్స్ పెట్టిస్తాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక తమన్ మ్యూజిక్ సినిమాకు మరో హైలెట్ గా నిలిచిందని చెప్పాలి. ఈ ట్రైలర్ చూసిన వారందరు..అఖండను మించిన యాక్షన్ ఉందేంటి బ్రో.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ చిత్రంతో రామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు చూడాలి.