ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలతో మరోపక్క రాజకీయాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పవన్ నటించిన భీమ్లా నాయక్ విడుదలై రికార్డ్ కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు షూటింగ్ చివరి అంకానికి చేరుకుంది. ఇక ఈ సినిమా తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ప్రత్యేక పాత్రలో నటించనున్నాడట. మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషించిన పంకజ్ త్రిపాఠీ.. ఈ చిత్రంలో విలన్ గా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఈ నటుడు నటించనున్నాడట. జూలై మొదటి వారంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఇక ఈ చిత్రం పవన్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది.