‘భీష్మ’ లాంటి కూల్ ఫన్ ఎంటర్టైనర్ సినిమాని తెలుగు ఆడియన్స్ కి ఇచ్చిన టీం నుంచి మరోకొత్త సినిమా అనౌన్స్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ భీష్మ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ దర్శకుడు వెంకీ కుడుముల, హీరోయిన్ రష్మిక, హీరో నితిన్ లు కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. “VNRTrio” అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీకి జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటివలే అనౌన్స్ అయిన ఈ మూవీ ఈరోజు గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి చిత్ర యూనిట్ పై క్లాప్ కొట్టాడు. ముహూర్తపు షాట్ కి గోపీచంద్ మలినేని, బాబీ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ ముహూర్త కార్యక్రమానికి హను రాఘవపూడి, బుచ్చిబాబు సన హాజరై చిత్ర యూనిట్ కి స్క్రిప్ట్ ని అందించారు. ఈ ఫన్ కన్నా మించి అని చెప్తున్న వెంకీ కుడుముల నితిన్ అండ్ రష్మికని పెట్టి ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. నిజానికి వెంకీ కుడుముల మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చెయ్యాల్సి ఉంది కానీ ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లలేదు. దీంతో కాస్త టైం తీసుకున్న వెంకీ కుడుముల నితిన్ సినిమా వర్క్స్ మొదలుపెట్టాడు.
Read Also: Manchu Family: రోడ్డునపడ్డ ఇంటి గుట్టు… మంచు మనోజ్ అనుచరుడిపై మంచు విష్ణు దాడి
#VNRTrio movie launched with Megastar @KChiruTweets Garu sounding the clap 🎬
Top directors @dirbobby, @megopichand, @hanurpudi & @BuchiBabuSana graced the grand launch event and wished team the best ❤️@actor_nithiin @iamRashmika @VenkyKudumula @gvprakash pic.twitter.com/QeQksv0ltL
— Mythri Movie Makers (@MythriOfficial) March 24, 2023