తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేసిన నటుల్లో మంచు మోహన్ బాబు ఒకరు. లెజండరీ నటుడిగా, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మంచు మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి మంచు మనోజ్, మంచు విష్ణు, మంచు లక్ష్మీ ఇండస్ట్రీలోకి వచ్చారు. తండ్రి వారసత్వాన్ని నిలబెట్టడంలో ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు అనేది వాస్తవం. సినిమా వారసత్వాన్ని కాసేపు పక్కన పెడితే గత కొంత కాలంగా మంచు మనోజ్, మంచు విష్ణుకి మధ్య గొడవలు జరుగుతున్నాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి. అన్నదమ్ములకి పడట్లేదు అని క్లోజ్ సర్కిల్స్ నుంచి వార్తలు బయటకి వస్తున్నా కూడా అందరి ముందు మాత్రం విష్ణు, మనోజ్ లు బాగానే ఉంటూ వస్తున్నారు. ఇటివలే జరిగిన మంచు మనోజ్, భూమ మౌనికరెడ్డిల పెళ్లికి కూడా అతిధిల మాత్రమే వచ్చి వెళ్లిపోయాడు మంచు విష్ణు. తన భార్య విరానికాతో పాటు మంచు మనోజ్ పెళ్లికి వచ్చిన మంచు విష్ణు, ఒక్క ఫోటో కూడా దిగకుండా గెస్టులా వచ్చి గెస్టులా వెళ్లిపోయాడు. ఈ సమయంలో అన్నదమ్ముల మధ్య గొడవ గురించి మరోసారి వార్తలు వినిపించాయి. అయితే మంచు మనోజ్, మోహన్ బాబులు కలిసి కనిపిస్తూ ఉండడంతో ఆ రూమర్స్ ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా మంచు మనోజ్ ఉన్నపళంగా తన అన్న మంచు విష్ణు తన మనుషులని కొడుతున్న అంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం సెన్సేషన్ క్రియేట్ చేసింది.
మంచు మనోజ్ మేనేజర్ అయిన ‘సారథి’ ఇంటికి వెళ్లి మరీ విష్ణు గొడవ చేసినట్టుగా అ వీడియోలో కనిపిస్తోంది. మంచు విష్ణుని ఇద్దరు వ్యక్తులు ఆపుతున్నట్లు కనిపిస్తున్న వీడియోలో సారథితో పాటు ఉన్న ఇంకో వ్యక్తి పేరు ‘గజ’. ఇతను మంచు ఫ్యామిలీకి పర్సనల్ సెక్యూరిటీ చూసుకుంటూ ఉంటాడు, మరీ ముఖ్యంగా మోహన్ బాబు సెక్యూరిటీ. మంచు విష్ణు చేస్తోన్న గొడవకు సంబంధించిన వీడియోను మనోజ్ తన ఫేస్ బుక్ స్టోరీలో షేర్ చేశాడు. అంతకు ముందు ఇన్ స్టా స్టోరీలోనూ పెట్టి డిలీట్ చేశాడు. మంచు విష్ణును సారథి, గజ ఆపుతుండగా.. “ఒరేయ్ అరేయ్ అని ఏదో అంటున్నాడు కదా?” అంటూ విష్ణు అడగడం, “నా ఇష్టం.. వాడేదో అంటున్నాడు కదాని విష్ణు అనడం కనిపిస్తోంది. కెమెరాలో కనిపించలేదు కానీ వీడియో షూట్ చేస్తున్నట్లు ఉన్న మంచు మనోజ్… “ఇదండి అసలు విషయం.. ఇలా ఇంటికి వచ్చి మా వాళ్లను కొడుతుంటాడు” అని చెబుతున్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన తర్వాత మంచు మనోజ్ 100 కూడా డయిల్ చేసినట్లు సమాచారం. మంచు విష్ణుపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. మరి తన ఇద్దరు కొడుకులని పిలిచి మంచు మోహన్ బాబు ఇద్దరికీ సర్ది చేప్తాడేమో చూడాలి.