Kushi: సాధారణంగా సాంగ్స్ అంటే.. ఎన్నో భావాలతో ముడిపడి ఉంటాయి. సినిమాలో ఉండే సీన్ కు తగ్గట్టు సాంగ్ ను రాస్తారు. ప్రేమ, బాధ, మోటివేషన్ .. ఇలా సీన్ కు తగ్గట్లు రాస్తారు. ఆ లిరిక్స్ కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటాయి. అయితే సినిమాల్లో చాలా రేర్ గా వచ్చే సాంగ్స్ ఉంటాయి. హీరోల పేర్లు, సినిమాల పేర్లు కలిసేలా రాస్తారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సై సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది. రోడ్డు మీద కనిపించే బోర్డుల మీద ఉండే పేర్లతో ఒక సాంగ్ ను క్రియేట్ చేసి కీరవాణి షాక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు డైరెక్టర్ శివ నిర్వాణ తనకు నచ్చిన దర్శకుడు మణిరత్నం సినిమా పేర్లనే సాంగ్ గా రచించాడు. అదే నా రోజా నువ్వే సాంగ్. విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ.
Samyukta: ఇండస్ట్రీలో మరో జంట విడాకులు.. ఎఫైర్స్ వలనే రెండు నెలలకే
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1 న రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నేడు విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి మొదటి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసి హీరోకు బర్త్ డే విషెస్ తెలిపారు. అయితే సాంగ్ విన్నాకా.. అందులోని కొన్ని పదాలు ఎక్కడో విన్నట్లుగా అనిపిస్తున్నాయి అని అనుకుంటున్నారు కదా.. ఆ అవే .. మణిరత్నం సినిమా టైటిల్స్.. ” రోజా..దిల్ సే…అంజలి..గీతాంజలి..నాయకుడు..ఓకె బంగారం..అమృత..మౌనరాగం..ఘర్షణ, చెలియా” ఇలా సాంగ్ మొత్తం లో ఈ సినిమా పేర్లను నింపేసి ఆయనపై అభిమానాన్ని చూపించేశాడు. ఇక ఈ సాంగ్ ను డైరెక్టర్ శివ నిర్వాణ రాయడం విశేషం. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మొదట సాంగ్ విన్నా.. ఇప్పుడు ఈ టైటిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టడానికి మరోసారి వినండి.