Samyukta: సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎన్ని రోజులు ఉంటాయి అనేది చెప్పడం ఎవరి వలన కాదు. ఎంతగానో ప్రేమించి, పెద్దవాళ్ళను ఒప్పించి, కోట్లు పెట్టి గ్రాండ్ గా వివాహం చేసుకుంటున్నారు. అయితే ఆ వివాహబంధంలో వాళ్ళు ఎన్నో రోజులు ఉండడం లేదు. పెళ్లి తర్వాత వచ్చే విబేధాలను తట్టుకోలేక విడాకులు తీసుకొని విడిపోతున్నారు. సినిమా స్టార్స్ మాత్రమే కాదు బుల్లితెర నటీనటులు కూడా అదే తరహాలో విడిపోతున్నారు. తాజాగా ఒక బుల్లితెర జంట ప్రేమించి పెళ్లి చేసుకొన్న రెండు నెలలకే తాము విడిపోతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. తమిళ్ లో ప్రసారమయ్యే సిప్పినీల్ ముత్తు అనే సీరియల్ లో జంటగా కనిపించరు సంయుక్త- విష్ణు కాంత్. ఈ సీరియల్ లో పరిచయం.. ప్రేమగా మారింది. ఆ ప్రేమ కాస్తా పెద్దలను ఒప్పించి పెళ్లిగా మారింది. ఇక ఈ జంట పెళ్లి చేసుకోవడంతో వారి అభిమానులు ఎంతగానో సంతోషించారు. అయితే వీరి పెళ్లి జరిగి ముచ్చటగా మూడు నెలలు కూడా కాలేదు. మేము విడిపోతున్నాం అంటూ ప్రకటించడం అందరిని షాకింగ్ కు గురిచేస్తోంది.
Adipurush: టీజర్ లో ట్రోల్ చేశారని.. అతడిని ట్రైలర్ లో లేపేశారా..?
మార్చిలో ఈ జంట వివాహం చేసుకున్నారు. మేలో విడిపోతున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలను డిలీట్ చేస్తూ.. తాము విడిపోతున్నట్లు పోస్ట్లు పెట్టారు. అయితే వీరు విడిపోవడానికి ఎఫైర్లు కారణమని చెప్పుకొచ్చారు. ” ఎఫైర్స్.. నిజమైన ప్రేమను సైతం ఫేక్ ప్రేమగా చూపిస్తాయి” అని విష్ణుకాంత్ పోస్ట్ చేయగా.. ” మై డియర్ హేటర్స్ .. ఒక మహిళను శక్తివంతంగా ఎదుర్కోలేనప్పుడు.. ఆమెపై నిందలు వేసి.. కించపరుస్తారు. ఇప్పటి నుంచి నా కొత్త జీవితం మొదలుకానుంది. ఒక పెద్ద డిజప్పాయింట్ తరువాత ముందుకు వెళ్ళడానికి నాకు కావాల్సిన ధైర్యాన్ని, శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వీరి విడాకులు నెట్టింట వైరల్ గా మారాయి.