Manchu Manoj : మంచు మనోజ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాడు. మిరాయ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో మనోజ్ విలనిజంకు మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రమంలోనే ఎన్టీవీ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న మనోజ్.. ఎన్టీఆర్ తో జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నాడు. చిన్నప్పుడు ఎన్టీఆర్ నేను మంచి ఫ్రెండ్స్. ఒకసారి కారులో కూర్చుని బెలూన్ అంటించాం. ఆ బెలూన్ కాలిపోతూ కిందకు కారుతోంది. నేను ఆ బెలూన్ ను చూడమంటూ ఎన్టీఆర్ మీదకు తోసేశాడు. అతని చేయికి అంటుకుని గాయం అయింది. అది చూసి నాకు చాలా భయం వేసింది. మా అమ్మమ్మ నన్ను పొట్టు పొట్టు కొట్టింది. ఆ దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను. కానీ తారక్ విషయంలో ఇప్పటికీ గిల్టీ ఫీలింగ్ ఉండేది. నా వల్లే అతని చేయికి మచ్చ ఏర్పడింది.
Read Also : Suhas : మళ్లీ తండ్రి అయిన యంగ్ హీరో
కొన్నేళ్ల దాకా అది అలాగే ఉండిపోయింది. ఇప్పుడు మానిపోయినట్టుంది. కనిపించట్లేదు. కానీ నాకు తారక్ ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఎమోషనల్ అయ్యాడు మనోజ్. ఇక సినిమాల పరంగా ఇప్పుడు తాను సరైన పాత్రలు ఎంచుకుంటున్నట్టు తెలిపారు. కేవలం హీరోగానే కాకుండా ఒక నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలన్నదే తన ఉద్దేశం అన్నాడు మనోజ్. అందుకోసం అన్ని రకాల సినిమాలను ఫాలో అవుతున్నట్టు వివరించాడు. చిన్నప్పటి నుంచి తన తండ్రి మోహన్ బాబు, ఎన్టీరామారావును చూస్తూ పెరిగానని.. వాళ్ల ప్రభావం తన మీద ఎక్కువగా ఉన్నట్టు వివరించాడు. వాళ్ల లాగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉందన్నాడు.
Read Also : Manchu Manoj : నా బయోపిక్ ఆ డైరెక్టరే తీయాలి.. మనోజ్ కామెంట్స్