Indian Idol : ఇండియాలోనే అతిపెద్ద సింగింగ్ రియాల్టీ షోగా ఇండియన్ ఐడల్ కు గుర్తింపు ఉంది. ఈ షోలో పాల్గొని గెలవాలని చాలా మంది కలలు కంటారు. తాజాగా ఇండియన్ ఐడల్-15 సీజన్ ముగిసింది. 2024 అక్టోబర్ నెలలో మొదలైన ఈ కాంపిటీషన్.. 2025 ఏప్రిల్ 6వ తేదీన ముగిసింది. ఈ సీజన్ విన్నర్ గా బెంగాలీ అమ్మాయి మానసి ఘోష్ నిలిచింది. ఆమెకు ట్రోఫీతో పాటు రూ.25లక్షల క్యాష్, కొత్త కారు బహుమతిగా ఇచ్చారు. ఈ సారి కూడా మన తెలుగు కుర్రాడు అనిరుధ్ కు నిరాశ ఎదురైంది. ఫైనల్ వరకు వెళ్లిన అనిరుధ్ ఆరో స్థానంలో నిలిచాడు.
Read Also : Prithiveeraj Sukumaran : తప్పుచేయలేదు.. ఎవరికీ భయపడం.. పృథ్వీరాజ్ తల్లి కామెంట్స్
ఇక రన్నరప్ లుగా నిలిచిన చక్రవర్తి, స్నేహా శంకర్ కి చెరో రూ.5 లక్షలు ఇచ్చారు. అనిరుధ్ గెలుస్తాడని చాలా మంది ఆశించారు. కానీ కుదరలేదు. గతంలో ఆహాలో ప్రసారం అయిన ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్ లో అనిరుధ్ కు రన్నరప్ దక్కింది. కానీ ఈ సారి రన్నరప్ వరకు వెళ్లలేకపోయాడు. కర్నూలుకు చెందిన అనిరుధ్ చాలా సింగింగ్ పోటీల్లో పాల్గొంటున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు సింగర్లు. ఈ ప్రోగ్రామ్ లో విన్ అయితే దేశ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందనేది చాలా మంది సింగర్ల నమ్మకం.