Mahesh Babu Trends on Google India regarding Animal Pre-Release Event:సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఒక్క పాన్ ఇండియా సినిమా తీయకపోయినా.. ఆయనకు ఇండియా వైడ్ క్రేజ్ అయితే ఉంది. సౌత్ వాళ్లకే కాదు.. ఆయన నార్త్ వాళ్లకు కూడా బాగా సుపరిచితం. అందుకే ప్రముఖ మ్యాగజైన్స్ కూడా ఆయన ఫోటోను కవర్ పేజిపై ప్రచురించుకుంటారు. ఇక బ్రాండ్ ఐటెమ్స్ కూడా ఆయన్నీ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకుంటారు. బాబుకు అంత క్రేజ్ ఉంది మరి. ఇక ఇటీవల యానిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేసిన సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా.. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నవంబర్ 27న(నిన్న) ఘనంగా హైదరాబాద్ లో జరుపుకుంది.
Martin Luther King : అనుకున్న సమయం కంటే ముందుగానే ఓటీటీ లోకి వచ్చేసిన మార్టిన్ లూథర్ కింగ్..
అయితే ఈ వేడుకకు మహేశ్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. ఇక ఈ వేడుకలో మహేశ్ బాబు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. సింపుల్ టీ షర్ట్ తో హాలీవుడ్ హీరోలా కనిపించాడు మహేశ్. అయితే ఈ ఈవెంటును చూసిన నార్త్ ప్రేక్షకులు.. మహేశ్ లుక్ కు ఫిదా అయిపోయారు. అసలు విషయం ఏంటంటే.. ఈ నార్త్ ఆడియెన్స్ అంతా మహేశ్ గురించి గూగుల్ ఆరా తీశారని తేలింది. అంటే ఒకరకంగా సినిమా సంగతి పక్కన పెట్టి మహేష్ బాబు గురించి వెతుకుతున్నారు. సినిమాకు ప్లస్ అవుతాడని తీసుకొస్తే ఆయన సెంటర్ అయి సినిమాను పక్కకు నెట్టి మైనస్ అయ్యాడని అంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేశ్ బాబు లుక్స్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ తర్వాత మహేశ్ పేరును గూగుల్ లో ట్రెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న మహేశ్ ఫ్యాన్స్.. అది మా సూపర్ స్టార్ క్రేజ్ అంటూ వాళ్లు కూడా ట్రెండింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేశ్ గుంటూరు కారం సినిమా చేస్తుండగా.. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేయనున్నాడు. అప్పుడు ఆయన రేంజ్ ఎలా ఉండనుందో ఇక.