ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో ఫుల్ స్వింగ్‌లో ఉన్న దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ ఒకడు. ఖైదీ సినిమాతో తన దర్శకత్వ ప్రతిభను చాటిన ఈ డైరెక్టర్.. ఆ తర్వాత విజయ్‌తో ‘మాస్టర్’ బ్లాస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ రెండు చిత్రాలు తమిళంలోనే కాదు, తెలుగులోనూ కమర్షియల్ విజయాలు సాధించాయి. అందుకే, అతనితో చేతులు కలిపేందుకు మన తెలుగు హీరోలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆల్రెడీ రామ్ చరణ్ ఈ దర్శకుడితో చర్చలు జరుపుతున్నాడు. కథ వర్కౌట్ అయితే, వీరి కాంబోలో సినిమా ఉండటం ఖాయం.
ఇప్పుడు మహేశ్ బాబు కూడా లోకేష్‌తో జోడీ కట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని ఇండస్ట్రీలో ఓ టాక్ వైరల్ అవుతోంది. రీసెంట్‌గా లోకేష్‌ని మహేశ్ కలవడం వల్లే, ఈ ప్రచారం ఊపందుకుంది. వీళ్లిద్దరు ఎందుకు కలిశారన్న విషయంపై పూర్తి స్పష్టత రాలేదు కానీ, సినిమా చర్చలైతే జరిగి ఉంటాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా మహేశ్ సినిమా చర్చలైతే గానీ, ఇలాంటి మీటింగ్స్ పెట్టుకోడు. ఒక దర్శకుడితో పర్సనల్‌గా కలిశాడంటే, కచ్ఛితంగా సినిమా గురించే ఉంటుంది. కాబట్టి, వీళ్ళ మధ్య కూడా సినిమా ఒప్పందం విషయమై టాక్స్ నడిచి ఉంటాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలావుండగా.. మహేశ్ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ విజయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28 ప్రాజెక్ట్‌ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. అనంతరం ఈ ఏడాది చివర్లో రాజమౌళి డైరెక్షన్‌లో ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టనున్నాడు. ఒకవేళ లోకేష్‌తో ప్రాజెక్ట్ ఓకే అయితే, ఈ సినిమాలన్నీ పూర్తయ్యేవరకు వేచి చూడాల్సిందే!