Sree Leela : యంగ్ బ్యూటీ శ్రీలీల షాకింగ్ ఫొటోలు పోస్ట్ చేసింది. ఆమె తాజాగా షేర్ చేసిన ఫొటోలు ఆమె ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ చేస్తున్నాయి. ఇవి చూస్తుంటే శ్రీలీల ఎంగేజ్ మెంట్ జరిగిందా అంటూ అంతా షాక్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ ఫొటోలు చూస్తుంటే ఎంగేజ్ మెంట్ జరిగినట్టుగానే ఉన్నాయి. ఈ ఫొటోల్లో ఆమె చెంపలకు కొందరు పసుపు పెడుతున్నారు. ఇందులో శ్రీలీల పెళ్లి కూతురు గెటప్ లో కనిపిస్తోంది. ఈ ఫొటోల కింద.. ‘నాకు ఈ రోజు బిగ్ డే’ అంటూ రాసుకొచ్చింది. పూర్తి వివరాలు త్వరలోనే చెబతాను అంటూ ‘కమింగ్ సూన్’ అంటూ రాసుకొచ్చింది.
Read Also : CM Chandrababu: నేడు కోనసీమకు సీఎం చంద్రబాబు
ఇవన్నీ చూసిన ఆమె ఫ్యాన్స్ పెళ్లి చేసుకోబోతోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. శ్రీలీల ఎవరికీ చెప్పకుండా సైలెంట్ గా పెళ్లి చేసుకుందేమో అని పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ ఫొటోలు ఎంగేజ్ మెంట్ వి కావేమో.. ఏదైనా యాడ్ కు సంబంధించిందేమో అని కొందరు అంటున్నారు. ఇంకొందరేమో అవి కొత్త సినిమాకు సంబంధించినవేమో అంటూ చెబుతున్నారు. ఏదేమైనా శ్రీలీల చేసిన పోస్టు ఇప్పుడు నెట్టింట రచ్చకు దారి తీసింది.
శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ తో సినిమా చేస్తోంది. అలాగే తెలుగులో రవితేజతో మూవీ చేస్తోంది. అటు తమిళంలో కూడా రెండు సినిమాలకు సైన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ దానిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నడుమ ఆమె నటించిన సినిమలు అన్నీ దాదాపు ప్లాపే అవుతున్నాయి. మరి రాబోయే సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి.
Read Also : HHVM : ‘వీరమల్లు’ టికెట్ ధరలకు తెలంగాణలో లైన్ క్లియర్..?